దీపికా అలాంటి కార్ లో వచ్చిందా…?

0

బాలీవుడ్ డ్రగ్స్ వ్యవహారం పై ఫోకస్ పెట్టిన నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు పలువురు సెలబ్రిటీలకు నోటీసులు జారీ చేసి విచారిస్తున్నారు. ఈ క్రమంలో ఒక్కొక్కరుగా ఎన్సీబీ ఎదుట హాజరవుతున్నారు. ఇప్పటికే రకుల్ ప్రీత్ సింగ్ తో సహా పలువురు విచారణకు హాజరవగా.. లేటెస్ట్ గా డ్రగ్స్ కేసులో హీరోయిన్ దీపిక పదుకొనే ప్రశ్నలను ఎదుర్కోంటుంది. విచారణ కోసం ఈ రోజు ఉదయం 10 గంటలకు ముందే దీపిక ఎన్సిబి కార్యాలయానికి చేరుకుంది దీపికా. దీపికా NCB ఆఫీస్ కు చేరుకున్న దృశ్యాలు మీడియాలో సోషల్ మీడియాలో తిరుగుతున్నాయి. ఈ క్రమంలో అందరూ దీపికా వచ్చిన కారు పై దృష్టి సారించారు.

కాగా దీపిక ఎన్సీబీ కార్యాలయానికి సాధారణ హుందాయ్ కార్ లో వచ్చింది. ఆమె దగ్గర అత్యంత ఖరీదైన కార్లు ఉంటే ఈ కార్ లో రావడమేంటని సోషల్ మీడియాలలో డిస్కషన్ జరుగుతోంది. అయితే ఎవరికి కనిపించకుండా మీడియా ఫోకస్ మళ్లించడానికే దీపికా నార్మల్ కార్ లో వచ్చి ఉంటుందని కామెంట్స్ చేస్తున్నారు. అంతేకాకుండా దీపికా సాధారణ దుస్తుల్లో కనిపించింది. ఆమె రెగ్యులర్ గా ఇలాంటి సింపుల్ డ్రెస్ లో ఎప్పుడూ కనిపించలేదు. అయితే ఎన్సీబీ అధికారుల ఎదుట హాజరవుతుంది కాబట్టి సింపుల్ గా వచ్చి ఉంటుందని అంటున్నారు. కారణాలు ఏవైనా బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకునే ఇలా నార్మల్ గా రావడం.. సింపుల్ గా కనిపించడం అందరిని ఆశ్చర్య పరిచింది.