పెళ్లి కోసం కాజల్ సర్జరీ చేయించుకుందా…?

0

దక్షిణాది అగ్ర కథానాయిక కాజల్ అగర్వాల్ త్వరలో పెళ్లి పీటలు ఎక్కనున్న సంగతి తెలిసిందే. ముంబైకి చెందిన యువ వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లుతో కలిసి ఈ నెల 30న(రేపు) కాజల్ ఏడడుగులు వేయనుంది. ఈ విషయాన్ని కాజల్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది అందరి ఆశీస్సులు కోరింది. కుటుంబ సభ్యులు కొద్దిమంది సన్నిహితుల సమక్షంలో కాజల్ – గౌతమ్ ల నిశ్చితార్థం నిరాడంబరంగా జరిగింది. వివాహనికి ఇంకా ఒకరోజు మాత్రమే ఉన్న నేపథ్యంలో నిన్న(బుధవారం) మెహందీ వేడుక జరిగింది. ఇందుకు సంబంధించిన ఫొటోలను కాజల్ గురువారం తన ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేస్తూ ‘ఈ రోజు మెహందీ వేడుక జరిగింది.. రేపు హల్ది ఫంక్షన్’ అంటూ పోస్ట్ చేసింది. అయితే సోషల్ మీడియాలో కాజల్ అగర్వాల్ ఫోటోలు చూసిన నెటిజన్స్ ఓ డౌట్ వ్యక్తం చేస్తున్నారు.

కాబోయే వధువు కాజల్ అగర్వాల్ ఫోటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. అయితే ఈ ఫొటోలు చేసిన నెటిజన్స్ పెళ్లి కోసం అమ్మడు ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుందా అనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే లేటెస్ట్ ఫోటోలలో కాజల్ చీక్స్ మరియు లిప్స్ డిఫరెంట్ గా కనిపిస్తున్నాయి. ఇంతకముందు కాజల్ ఫోటోలకు ఈ ఫోటోలను కంపేర్ చేసి చూస్తే తేడా స్పష్టంగా అర్థంమైపోతుంది. అందుకే అమ్మడు చీక్స్ మరియు లిప్స్ కి సర్జీరీ చేయించుకుందేమో అని కామెంట్ చేస్తున్నారు. మరి కాజల్ నిజంగానే సర్జీరీ చేయించుకుందో లేదా పెళ్లి కళ వల్ల ముఖం అలా వెలిగిపోతూ కనిపిస్తుందో. ఏదేమైనా మూడు పదుల వయసు దాటినా కాజల్ అందం ఏమాత్రం తగ్గలేదని చెప్పవచ్చు. కాగా కరోనా పరిస్థితుల నేపథ్యంలో పెళ్లికి పరిమిత సంఖ్యలోనే అతిథులను ఆహ్వానిస్తున్నట్లు కాజల్ ఇదివరకే స్పష్టం చేసింది. రేపు ముంబైలో కుటుంబ సభ్యులు సన్నిహితుల సమక్షంలో కాజల్ – గౌతమ్ కిచ్లుల వివాహం వైభవంగా జరుగనుంది. కాజల్ పెళ్లి తర్వాత కూడా నటన కొనసాగిస్తానని ప్రకటించిన సంగతి తెలిసిందే.