విడదీయరాని మెగాసోదరబంధం

0

అన్నంటే తమ్ముళ్లకు ప్రాణం.. తమ్ముళ్లంటే అన్నకు ప్రాణం. విడదీయరాని మెగానుబంధమిది. ఎన్నటికీ విడిపోని మెగా సోదర బంధమిది. సినీపరిశ్రమల్లో బంధుప్రీతి గురించి చర్చ సాగుతున్న వేళ మెగా బ్రదర్స్ మధ్య అనుబంధం గురించి ఆసక్తికర చర్చ సాగుతోంది. మెగాస్టార్ చిరంజీవి- నాగేంద్రబాబు- పవన్ కల్యాణ్ మధ్య అనుబంధం గురించి ప్రత్యేకించి చెప్పాలా? మెగా ఆదర్శ సోదరులుగా అభిమానుల గుండెల్లో నిలిచి ఉన్నారు.

ఇక ఈ అనుబంధాన్ని సోషల్ మీడియాల్లోనూ ఆవిష్కరిస్తూ మెగాస్టార్ చిరంజీవి అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నారు. ముఖ్యంగా తన కుటుంబ సభ్యులతో సెలబ్రేషన్ కి సంబంధించిన ప్రతి అవకాశాన్ని ఆయన వదిలి పెట్టడం లేదు. తాజాగా నాగబాబు బర్త్ డే ని అన్నయ్య వదల్లేదు. ఎంతో ఎమోషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడం అభిమానుల్లో హాట్ టాపిక్ గా మారింది.

“నా నమ్మకస్తుడైన… భావోద్వేగపరుడు.. దయార్థ్ర హృదయం కలవాడు.. ఆహ్లాదకరమైన ప్రేమగలవాడు.. తమ్ముడు నాగబాబు కి పుట్టినరోజు శుభాకాంక్షలు“ అంటూ చిరు కాస్త ఎమోషనల్ గానే స్పందించారు. మన బంధం.. అనుబంధం ఎప్పటికీ ఇలాగే కొనసాగాలని .. నీ ప్రతి పుట్టినరోజుకి అది మరింత బలపడాలని ఆశిస్తున్నాను! అన్నారు. అన్నదమ్ముల అనుబంధం విడదీయరానిది అనడానికి ఇంతకంటే ఎమోషనల్ మూవ్ మెంట్ ఇంకేం కావాలి? నాగ బాబు సైతం చిరు బర్త్ డేకి పుట్టినరోజున శుభాకాంక్షలు చెప్పడమే కాకుండా.. తోబుట్టువులుగా జీవితకాలం కలిసి మెలిసి ఇలానే సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు.