తన పర్సనల్ ఎజెండా కోసమే కంగనా ఇలా చేస్తుందా..??

0

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ వివాదాల క్వీన్ కంగనా రనౌత్ ఇప్పట్లో సుశాంత్ సింగ్ గురించి నేపోటిజం గురించి చర్చలను ఆపేలా లేదు. సుశాంత్ సింగ్ రాజ్పుత్ చనిపోయినప్పటి నుండి సోషల్ మీడియాలో కంగనా ఆరోపణలు హైలైట్ అవుతూనే ఉన్నాయి. బాలీవుడ్లోని బంధుప్రీతి అలాగే మాఫియా కారణంగానే సుశాంత్ తన జీవితాన్ని వదులుకున్నాడని బలంగా వాదిస్తోంది. బయట వ్యక్తిగా.. కంగనా ప్రతి రోజు తన కామెంట్లతో బాలీవుడ్ మాఫియా ఉందంటూ నిరూపించడానికి ప్రయత్నిస్తుంది. అయితే ఈసారి నేపోటిజం వివాదాన్ని మరో లెవెల్ కి తీసుకెళ్లింది. ఆమె చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వివాదాలను చెలరేగేలా చేస్తున్నాయి. సుశాంత్ సింగ్ ఆత్మహత్య కాదు.. హత్యకు గురయ్యాడని సంచలన వ్యాఖ్యలు చేస్తూనే ఉంది. అలాగే బాలీవుడ్ ఇండస్ట్రీలో మూవీ మాఫియా కూడా ఉందని.. బాలీవుడ్ నిర్మాతలు నటుల పై కామెంట్ల వర్షం కురిపిస్తుంది. ఇటీవలే నటుడు నసీరుద్దీన్ షా మాట్లాడి చురకలు అంటించిన విషయం తెలిసిందే. అసలు బాలీవుడ్ ఇండస్ట్రీలో మాఫియా అనేదే లేదు.

ఎవరైతే ఇండస్ట్రీలో జరుగుతున్న వాటి పై ఫ్రస్ట్రేషన్ కు లోనవుతున్నారో.. వారే కావాలని మీడియా ముందు ఇలా మాఫియా పేరుతో హల్చల్ చేస్తున్నారని అన్నాడు. ఇక నసీరుద్దీన్ షా.. కంగనా గురించి కూడా పలు వ్యాఖ్యలు చేసాడు. కంగనాలా హాఫ్ నాలెడ్జ్ తో చేసే ఆరోపణల పై ఎవరు ఆసక్తి చూపరు. అలాగే సుశాంత్ కు న్యాయం జరగాలని ఆమె తీసుకుంటున్న నిర్ణయాలు అభిప్రాయాల పై స్పందించే అవసరం లేదని అన్నారు. సుషాంత్‍ మరణంతో సంబంధమే లేని కరణ్‍ జోహార్‍ లాంటి తన శత్రువులను టార్గెట్‍ చేస్తూ మాట్లాడిందని అంటున్నారు. మీడియా రియా చక్రవర్తిని దోషిగా చూపిస్తున్నా కానీ కంగన మాత్రం ఏమీ మాట్లాడలేదు. రియా గురించి మాట్లాడితే తన ఫేమ్ పక్కకు పోతుందని అనుకుందా.. లేక అజెండా బేస్డ్ వార్‍ చేస్తుందా? అంటూ ఆరోపించారు. మొదట్లో సుషాంత్‍ సింగ్‍ తో నటించడానికి వెనకాడిన కంగనా.. అతని మృతిని హైలైట్‍ చేస్తోందని అంటున్నారు. తన అజెండా కోసం సుశాంత్ మృతి విషయాన్నీ వాడుకుంటోందని ‘బాయ్‍కాట్‍ కంగన’ హ్యాష్‍టాగ్‍ ట్విట్టర్‍లో నెటిజన్లు ధ్వజమెత్తుతున్నారు. దీంతో కంగనాకు షాక్ తగిలినట్లే అయిందని సినీవర్గాలు భావిస్తున్నాయి.