రైతులు ఉగ్రవాదులు! కంగన కామెంట్ పై రాజకీయ దుమారం!!

0

బాలీవుడ్ ఫైర్ బ్రండ్ కంగన మరోసారి హద్దులు దాటింది. దేశానికి అన్నం పెడుతున్న రైతన్నని టార్గెట్ చూస్తూ తాజాగా చేసిన వ్యాఖ్యలు పెనుదుమారం రేపుతున్నాయి. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ అనుమానాస్పద మృతి తరువాత వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ సంచలనం సృష్టించింది. ఏకంగా మహారాష్ట్ర ప్రభుత్వాన్ని.. ముంబై పోలీసుల్ని టార్గెట్ చూస్తూ కంగన చేసిన వ్యాఖ్యలు ముంబైలో రాజకీయ దుమారాన్ని రేపాయి.

అయితే ఈ వివాదం ఇంకా సద్దుమనగక ముందే కంగన మరోసారి రెచ్చిపోయింది. ఏకంగా రైతుల్ని ఉగ్రవాదులతో పోలుస్తూ వ్యాఖ్యలు చేసింది. ఇటీవల కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా రైతులు దేశవ్యాప్త బంద్ కు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. దీనిపై ఘాటుగా స్పందించిన కంగన రైతుల్ని తీవ్ర వాదులుగా పోలుస్తూ సంచలన వ్యాఖ్యలు చేసింది.

అ వ్యాఖ్యలపై ఓ లాయర్ మండిపడ్డారు. కర్ణాటకకు చెందిన న్యాయవాది రమేష్ నాయక్ కంగనపై నిప్పులు చెరిగారు. ఆమెపై కేసు పెట్టారు. రైతులు నీకు ఉగ్రవాదులుగా కనిపిస్తున్నారా? కడుపుకి అన్నం తింటున్నా? లేక గడ్డి తింటున్నావా? అని మండి పడ్డారు. నీకు కొవ్వు పట్టింది. ఆ కొవ్వుని దించేస్తాం. అని మండిపడ్డారు. కంగనపై కర్ణాటకలోని తుముకూరు జిల్లా ఎస్పీకి సెప్టెంబర్ 22న మెయిల్ ద్వారా రమేష్ నాయక్ కంప్లైంట్ చేశారట. అయితే ఇంత వరకు కంగనపై ఎలాంటి చర్య తీసుకోలేదని రమేష్ నాయక్ మండి పడుతున్నారు.