ప్రభుత్వ లాంఛనాలతో ఎస్.పి.బాలు అంతిమ సంస్కారం

0

లెజెండరీ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అంతిమ సంస్కారాలు కార్యక్రమం ఈ ఉదయం 10: 30 గంటలకు తిరువల్లూరు జిల్లాలోని తమరాయిపక్కియంలోని తన ఫామ్ హౌస్ లో పూర్తి కానుంది. బాలూ పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వ గౌరవ లాంచనాలతో స్వర్గస్థ ప్రాప్థతను అందుకోనున్నారు.

తిరువల్లూరు జిల్లా కలెక్టర్ అభిమానులను బాలు అంత్యక్రియలకు అనుమతించలేదని తెలుస్తోంది. కరోనావైరస్ మహమ్మారి ఆంక్షల కారణంగా ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఫామ్ హౌస్ ప్రాంగణంలోకి జనాలు రాకుండా ఉండటానికి ఫామ్ హౌస్ నుండి 2 కిలోమీటర్ల దూరంలో బారికేడ్లను ఏర్పాటు చేశారు.

బాలూ పార్థీవ దేహాన్ని నిన్న రాత్రి తన చెన్నై నివాసం నుండి ఫామ్ హౌస్ కు తీసుకువెళ్లారు. అనేకమంది సినీ పరిశ్రమ శ్రేయోభిలాషులు రాజకీయ నాయకులు అక్కడకు చేరుకుని నివాళులు అర్పించాలని భావిస్తున్నారు. అయితే ఫామ్ హౌస్ లోకి సామాన్యులకు ప్రవేశం లేదని ఆ మేరకు జిల్లా కలెక్టర్ ఆదేశించారని తెలుస్తోంది. ప్రముఖుల వరకూ నివాళులకు అనుమతించే వీలుంది.