ఫర్ బిడెన్ లవ్- అనామిక ట్రైలర్ టాక్ : బోల్డ్ సన్నివేశాలతో పూజ

0

‘విశ్వరూపం’ ‘విశ్వరూపం 2’ ‘ఉత్తమ విలన్’ సినిమాలలో హీరోయిన్ గా నటించిన పూజా కుమార్ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే. ఆ సినిమాల్లో కమల్ హాసన్ తో రొమాన్స్ చేసిన పూజా కుమార్ రియల్ లైఫ్ లో కూడా కమల్ తో రిలేషన్ షిప్ కొనసాగించిందని అప్పట్లో వార్తల్లో నిలిచింది. తెలుగులో రాజశేఖర్ హీరోగా వచ్చిన ‘PSV గరుడ వేగ’ సినిమాలో నటించింది. అయితే రెండేళ్ల నుంచి సినిమాలకు దూరంగా ఉంటూ వస్తున్న ఎన్నారై హీరోయిన్ పూజా కుమార్ లేటెస్ట్ గా ‘ఫర్ బిడెన్ లవ్’ అనే ఒరిజినల్ మూవీలో నటించింది. నాలుగు స్టోరీలతో రూపొందిన ఈ సిరీస్ లో ”అనామిక”అనే భాగంలో పూజా కుమార్ నటించింది. జీ5 ఒరిజినల్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్న ‘అనామిక’ ట్రైలర్ రిలీజ్ చేశారు.

‘అనామిక’ ట్రైలర్ చూస్తుంటే ‘ఒక మధ్య వయస్కురాలైన వివాహిత తన భర్త ప్రేమను కోల్పోయి.. తనకంటే చాలా తక్కువ వయసున్న యువకుడితో రిలేషన్ షిప్ కొనసాగిస్తూ ప్రేమలో పడితే జరిగే పర్యవసానాల నేపథ్యంలో ఈ స్టోరీ ఉండబోతోందని తెలుస్తోంది. నేటి సమాజంలో జరుగుతున్న అక్రమసంబంధాల గురించి.. మెచ్యూర్డ్ లవ్ స్టోరీ గురించి ఈ సిరీస్ లో చర్చించారు. పూజా టైటిల్ రోల్ అనామిక గా కనిపించి సెక్సీ లుక్స్ లో అదరగొట్టింది. బోల్డ్ సన్నివేశాల్లో నటించి అందరిని ఆశ్చర్య పరిచింది. పూజా కుమార్ తో పాటు ఆదిత్య సీల్ – హర్ష్ ఛాయ ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. నేషనల్ అవార్డు విన్నింగ్ డైరెక్టర్ ప్రియదర్శన్ నాయర్ తెరకెక్కించిన ఈ సిరీస్ ని రతన్ జైన్ – గణేష్ జైన్ లు నిర్మించారు.