అనుష్క పెళ్లిపై మరోసారి ఫుల్ క్లారిటీ.. !

0

అనుష్క శెట్టి తన వ్యక్తిగత జీవితంపై వివాహ సంబంధం గురించి వస్తున్న పుకార్లపై మరోసారి క్లారిటీ ఇచ్చింది. గత కొన్ని నెలలుగా అనుష్క పెళ్లి వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే వుంది. ఈ వార్తలపై నెటిజన్స్ ప్రత్యేక ఆసక్తిని చూపిస్తున్నారు. ఆమె ఫ్యాన్స్ తో ఇంటరాక్ట్ అయిన ప్రతీ సందర్భంలోనూ ఈ విషయంపై క్లారిటీ కోసం ప్రయత్నిస్తూనే వున్నారు.

ప్రభాస్ తో అనుష్క వివాహం అంటూ వస్తున్న పుకార్లను ఆమె ఖండించినప్పటికీ ఈ జంట ఎప్పుడూ హాట్ టాపిక్ గానే మారుతూ సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారుతూనే వుంది. ఈ నేపథ్యంలో అనుష్క వివాహం గురించి తన అభిప్రాయాన్ని దృక్పథాన్ని స్పష్టం చేసింది. అనుష్క మాట్లాడుతూ ` పెళ్లిని నమ్ముతున్నాను. పిల్లలు కూడా ఉండాలని కోరుకుంటున్నాను. అయితే ఈ విషయంలో నాకు ఎలాంటి తొందర లేదు. చాలా టైమ్ తీసుకుని నాకు నచ్చిన వాడు ఎదురుపడినప్పుడే వివాహం చేసుకోవాలనుకుంటున్నాను` అని తెలిపింది.

వివాహంపై తల్లిదండ్రుల ఒత్తిడి గురించి మాట్లాడిన అనుష్క తనకు 20 సంవత్సరాల వయస్సు నుండి తన తల్లిదండ్రులు వివాహం కోసం ఒత్తిడి తెచ్చారని స్పష్టం చేశారు. అయితే పెళ్లి కోసం తన తల్లిదండ్రులు ఇప్పుడు ఒత్తిడి చేయడం మానేశారని ఆమె తెలిపింది. తన కెరీర్ కొనసాగించడానికే ఆసక్తిగా ఉందట. ఇటీవల మీడియా ఇంటరాక్షన్ సందర్భంగా ఆమెకు సినిమాల నుంచి తప్పుకోవాలని లేదని స్పష్టం చేశారు.