‘గెస్’ రిపీట్ చేసింది

0

సెలబ్రెటీలు ముఖ్యంగా స్టార్స్ వేసిన డ్రస్ మళ్లీ వేయకుండా బయటకు వచ్చినప్పుడు ఎప్పుడు కూడా విభిన్నమైన డ్రస్ ల్లో కనిపిస్తూ ఉంటారు. ఇక హీరోయిన్స్ విషయంలో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. స్టార్ హీరోయిన్స్ కనిపించిన డ్రస్ లో మళ్లీ కనిపించడం చాలా చాలా అరుదుగా చూస్తూ ఉంటాం. ఎవరైనా సెల్రబెటీ వేసుకున్న డ్రస్ ను మళ్లీ వేసుకున్నప్పుడు అది పెద్ద వార్త అవుతుంది. తాజాగా దిశా పటాని వేసుకున్న ఒక క్రాప్ టాప్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కొన్ని రోజుల క్రితం దిశా పటాని గెస్ అంటూ ఉన్న ఈ క్రాప్ ను ధరించింది. మళ్లీ తాజాగా కూడా అదే క్రాప్ టాప్ ను ధరించింది.

దిశా పటాని రెండు సార్లు ఈ గెస్ క్రాప్ టాప్ ను ధరించడం వెనుక ఏమైనా ఆంత్యర్యం ఉందా అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు. క్రాప్ టాప్ సేమ్ అయిన పాయింట్ మాత్రం విభిన్నమైనవి వేసుకుంది. గెస్ అంటూ టాప్ మీద ఉన్న అక్షరాలను కనిపించేందుకు దిశా పటాని ప్రయత్నించింది. అలా ఎందుకు అనేది ఆమె చెప్పాలి. గెస్ అంటూ నెటిజన్స్ ను ఏమైనా గెస్ చేయమని చెబుతుందా అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు. అసలు విషయంపై ఆమె క్లారిటీ ఇస్తుందేమో చూడాలి. ప్రస్తుతం బాలీవుడ్ లో వరుసగా సినిమాలు చేస్తున్న ఈ అమ్మడు తెలుగులో లోఫర్ సినిమాను చేసింది. మళ్లీ తెలుగు నుండి ఆఫర్లు వచ్చినా కూడా ఆమె ఆసక్తి చూపించలేదు.