బెలూన్స్ బిజినెస్ పై సీరియస్ అయిన హాటీ

0

తెలుగు మరియు తమిళంలో పలు చిత్రాల్లో నటించి మెప్పించిన ముద్దుగుమ్మ హన్సిక గత రెండు మూడు సంవత్సరాలుగా ఎక్కువగా ఆఫర్లు దక్కించుకోవడంలో విఫలం అవుతోంది. లేడీ ఓరియంటెడ్ చిత్రాలు చేయడంతో పాటు ప్రాముఖ్యత లేని పాత్రలు చేస్తు ఉండటంతో ఈమె కెరీర్ ముగిసినట్లే అంటున్నారు. ఈ సమయంలో ఈమె ఒక బిజినెస్ ప్రారంభించింది అంటూ ఒక తమిళ మీడియా సంస్థ ఒక కథనం ప్రసారం చేసింది. దాంతో హన్సికకు కోపం వచ్చింది.

ఇంతకు ఆ బిజినెస్ ఏంటో తెలుసా.. బెలూన్స్ బిజినెస్. ఫంక్షన్స్ మరియు ఇతర కార్యక్రమాలకు డెకరేషన్ కోసం ఈమె బెలూన్స్ సరఫరా చేస్తుంది అంటూ ఒక ఫన్నీ కథనంను వారు అల్లడం జరిగింది. బెలూన్స్ బిజినెస్ లో హన్సిక బంధువులు ఉన్నారట. దాంతో ఆమె కూడా అదే బిజినెస్ లో దిగాలని నిర్ణయించుకుని మొదలు పెట్టింది అంటూ ఆ కథనంలో పేర్కొనడం జరిగింది. అయితే ఆ వార్తలపై హన్సిక సీరియస్ అయ్యింది.

ట్విట్టర్ లో ఆ కథనంపై స్పందించిన హన్సిక సదరు మీడియా సంస్థకు కౌంటర్ ఇచ్చింది. నేను ఎలాంటి వ్యాపారం చేయబోతున్నాను అనే విషయంలో మీ ఆలోచనకు పదును పెట్టినందుకు థ్యాంక్స్. నిజంగా ఈ వార్త నాకు క్రాక్ తెచ్చేలా ఉంది. నేను ఊహించని దాని గురించి మీరు ఆలోచించారు. అది నాకు ఆశ్చర్యంగా ఉందంటూ ఆమె కామెంట్స్ చేసింది. మొత్తానికి తను ఎలాంటి బిజినెస్ లు చేయడం లేదు సినిమాలతోనే ఇంకా బిజీగా ఉన్నట్లుగా చెప్పే ప్రయత్నం చేసింది.