రేట్ పెంచేసిన కన్నడ బ్యూటీ…?

0

కన్నడ బ్యూటీ రష్మిక మందాన్న ‘ఛలో’ మూవీతో టాలీవుడ్ లో అడుగుపెట్టింది. మొదటి సినిమాతోనే మంచి విజయం అందుకున్న ఈ బ్యూటీ వరుస అవకాశాలతో ఛలోమంటూ దూసుకుపోతోంది. ఈ క్రమంలో ‘గీత గోవిందం’ ‘సరిలేరు నీకెవ్వరు’ ‘భీష్మ’ వంటి సూపర్ హిట్స్ అందుకుని లక్కీ బ్యూటీగా మారిపోయింది. ప్రస్తుతం అల్లు అర్జున్ – సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ‘పుష్ప’ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. దీంతో పాటు తమిళ్ లో కార్తీతో కలిసి ‘సుల్తాన్’.. కన్నడలో ‘పొగరు’ చిత్రాల్లో నటించింది రష్మిక. టాలీవుడ్ లో సీనియర్ హీరోయిన్స్ కి పోటీనిస్తున్న ఈ ముద్దుగుమ్మ.. రెమ్యూనరేషన్ కూడా వారికి తగ్గట్టుగానే తీసుకుంటుందని టాక్ నడుస్తోంది.

శర్వానంద్ హీరోగా నటిస్తున్న ‘ఆడాళ్లూ మీకు జోహార్లు’ అనే చిత్రంలో రష్మిక హీరోయిన్ గా నటించనుంది. కిషోర్ తిరుమల దర్శకత్వం వహించనున్న ఈ చిత్రాన్ని దసరా సందర్భంగా పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభించారు. ఈ చిత్రం కోసం ఈ బ్యూటీ 2 కోట్లు రెమ్యూనరేషన్ డిమాండ్ చేసిందట. మేకర్స్ బేరసారాలు జరపడంతో చివరకు 25 లక్షలు తగ్గించి 1.75 కోట్లు ఇవ్వాల్సిందిగా కోరిందని ఇండ్రస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. ఇదే కనుక నిజమైతే ఈ మధ్యే స్టార్ స్టేటస్ అందుకున్న రష్మిక కు అత్యధిక పారితోషికం అందుతుందనే చెప్పవచ్చు. కరోనా క్రైసిస్ నేపథ్యంలో ప్రొడ్యూసర్స్ కోసం నటీనటులు సాంకేతిక నిపుణులు రెమ్యూనరేషన్ లో కోత విధించాలని నిర్ణయించారు. అందుకే రష్మిక మందాన్న రేట్ పెంచి మళ్ళీ తగ్గించిందేమో మరి అని ఫిలిం సర్కిల్స్ లో కామెంట్స్ చేస్తున్నారు.