Templates by BIGtheme NET
Home >> Cinema News >> మెగాస్టార్ దృష్టిలో మెగా రీమేక్స్ లో సెట్ అయ్యే హీరోలు..!

మెగాస్టార్ దృష్టిలో మెగా రీమేక్స్ లో సెట్ అయ్యే హీరోలు..!


ప్రముఖ తెలుగు ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్ ‘ఆహా’ లో స్టార్ హీరోయిన్ అక్కినేని సమంత ‘సామ్ జామ్’ అనే టాక్ షో చేస్తున్న సంగతి తెలిసిందే. దీపావళి సందర్భంగా ప్రారంభమైన ఈ టాక్ షో లో పలువురు సెలబ్రిటీలను సమంత తనదైన శైలిలో ఇంటర్వ్యూ చేస్తూ వస్తోంది. ఈ క్రమంలో తాజాగా మెగాస్టార్ చిరంజీవి కూడా ఈ షోలో అతిథిగా పాల్గొన్నారు. నేడు క్రిస్మస్ కానుకగా ఈ మెగా ఎపిసోడ్ ఆహా లో స్ట్రీమింగ్ కి పెట్టారు. ఇందులో సామ్ అడిగిన ప్రశ్నలకు చిరు తనదైన శైలిలో సమాధానాలు చెప్పారు. ఈ సందర్భంగా ‘మీ సూపర్ హిట్ చిత్రాలను రీమేక్ చేయాల్సి వస్తే ఇప్పటి హీరోలలో మీ రోల్ ని ఎవరు ఎఫెక్టీవ్ గా చేయగలరు’ అని ప్రశ్నించగా చిరు పలువురు హీరోల పేర్లు చెప్పాడు.

‘జగదీకవీరుడు అతిలోకసుందరి’ సినిమా చరణ్ కి సూట్ అవుతుందని.. మహేష్ బాబు అయినా న్యాయం చేయగలడని చెబుతూ.. అతిలోకసుందరిగా మాత్రం సమంత సెట్ అవుతుందని చిరు చమత్కరించారు. ‘ఠాగూర్’ సినిమా పవన్ కళ్యాణ్ కి అయితే బాగుంటుందని.. ‘ఇంద్ర’ సినిమాలో ప్రభాస్ సూట్ అవుతాడని చెప్పుకొచ్చాడు. ‘ఛాలెంజ్’ సినిమా కోసం బన్నీ – విజయ్ దేవరకొండ ల పేర్లు సూచించారు. ‘గ్యాంగ్ లీడర్’ లో తారక్ లేదా చరణ్ అయితే బాగుంటుందని తెలిపాడు. ‘రౌడీ అల్లుడు’ రవితేజ మరియు బన్నీకి సూట్ అవుతుందని అన్నాడు. అయితే ‘స్వయంకృషి’ సినిమా మాత్రం ఎవరికీ సెట్ అవదని పేర్కొన్నారు. ఇక సమంత అడగకుండానే ‘విజేత’ సినిమా నాగచైతన్య కు సరిపోతుందని మెగాస్టార్ చెప్పారు.