Templates by BIGtheme NET
Home >> Cinema News >> #PSPK27 కోసం హాలీవుడ్ VFX ఆ రేంజులో

#PSPK27 కోసం హాలీవుడ్ VFX ఆ రేంజులో


హాలీవుడ్ నుంచి టాలీవుడ్ కి టెక్నీషియన్ల దిగుమతి ఇప్పుడే కొత్తేమీ కాదు. రాజమౌళి బాహుబలి ఫ్రాంఛైజీ కోసం ఆనాడే భారీ బడ్జెట్లు వెచ్చించి బరిలో దించారు. ఆ తర్వాత సాహో సినిమాని ఆల్మోస్ట్ హాలీవుడ్ సాంకేతిక నిపుణులతో ఆ రేంజులోనే తీశారు. శంకర్ లాంటి దర్శకుడు ప్రతిసారీ హాలీవుడ్ టెక్నీషియన్లను బరిలో దించుతున్నారు. ఇటీవల రోబో – 2.0 లాంటి భారీ పాన్ ఇండియా చిత్రాల కోసం శంకర్ హాలీవుడ్ టెక్నీషియన్లతో పని చేశారు.

తెలుగులో రాజమౌళి తర్వాత క్రిష్ హాలీవుడ్ సాంకేతిక నిపుణులతో అనుభవం ఘడించారు. అప్పట్లో బాలకృష్ణ 100వ చిత్రం గౌతమిపుత్ర శాతకర్ణి కోసం హాలీవుడ్ టెక్నీషియన్లతో పని చేశారు. అయితే బాహుబలి వీఎఫ్.ఎక్స్ కోసం అయినంత ఖర్చు చేయకుండా పరిమిత బడ్జెట్లో అంత గొప్ప విజువల్స్ ని తెచ్చిన ఘనత క్రిష్ కే దక్కుతుంది. బడ్జెట్ కంట్రోల్ అన్నది అతడి ప్రత్యేకత. ఇక సైరా నరసింహారెడ్డికి సురేందర్ రెడ్డి ఏకంగా 100 కోట్లు వీఎఫ్.ఎక్స్ కోసం ఖర్చు చేయించారన్న సమాచారం ఉంది. వందల కోట్లతో అయ్యేది కేవలం అందులో సగం ఖర్చుతోనే చేయగలగడమే గొప్ప.

ఇప్పుడు అదే తీరుగా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమా కోసం క్రిష్ ప్లాన్ చేస్తున్నారట. పీఎస్ పీకే 27గా ప్రాచుర్యంలో ఉన్న ఈ మూవీ కి భారీ వీఎఫ్.ఎక్స్ వర్క్ అవసరం. ఇందులో పవన్ రాబిన్ హుడ్ తరహా పాత్రలో నటిస్తున్నారు. కోహినూర్ వజ్రం.. బ్రిటీష్ కాలం నాటి యుద్ధాల నేపథ్యంలో ఇంట్రెస్టింగ్ హిస్టారికల్ కాన్సెప్టును ఎంచుకున్న క్రిష్ అందుకు తగ్గట్టు భారీ విజువల్ గ్రాఫిక్స్ కూడా చేయిస్తున్నారట. పవన్ బర్త్ డేకి రిలీజ్ చేసిన పోస్టర్లకు అద్భుత స్పందన వచ్చింది. ఇక క్రిష్ ఎంపిక చేసిన హాలీవుడ్ టెక్నీషియన్ ఎవరు? అంటే.. ప్రపంచ ప్రఖ్యాత విజువల్స్ ఎఫెక్ట్స్ కంపెనీ ఇండస్ట్రియల్ లైట్ అండ్ మ్యాజిక్ లో ఎక్కువగా పనిచేసే స్టార్ వార్స్ ఎపిసోడ్ VII – రెడీ ప్లేయర్ వన్ వంటి సినిమాల్లో పనిచేసిన ప్రముఖ హాలీవుడ్ టెక్నీషియన్ బెన్ లాక్ అనే విజువల్ ఎఫెక్ట్స్ సూపర్వైజర్ ని పవన్ కోసం బరిలో దించుతున్నారట. ఇదివరకూ బెన్ హైదరాబాద్ లో దిగారు. ఇప్పుడు మరోసారి ఆయన బరిలో దిగే ఆస్కారం ఉందని తెలుస్తోంది.