నేను చూపించింది నీకు కనిపించదు.. నెటిజన్ పై తాప్సి ఫైర్

0

సోషల్ మీడియాలో ప్రముఖుల పోస్ట్ లకు బ్యాడ్ కామెంట్స్ అనేవి చాలా కామన్ గా మనం చూస్తూనే ఉంటాం. కాని కొందరు వాటిని లైట్ తీసుకుంటే మరి కొంరదు మాత్రం సీరియస్ గా రియాక్ట్ అవుతారు. అన్నింటికి కాకున్నా కొన్నింటికి అయినా హీరోయిన్స్ కొందరు రియాక్ట్ అవ్వడం మనం చూస్తూనే ఉంటాం. తాజాగా తాప్సి రష్మి రాకెట్ సినిమాలో నటిస్తున్న విషయం తెల్సిందే. ఆ సినిమాకు సంబంధించిన ఫొటోలను తాప్సి షేర్ చేసింది. తాప్సి ఈ సినిమాలో అథ్లెట్ గా కనిపించబోతుంది. అందుకు సంబంధించిన పొట్టి నిక్కర్ స్పోర్ట్స్ బనియన్ వేయడంతో కాస్త హాట్ గా కనిపించింది.

ఆ ఫొటోలకు ఒక నెటిజన్ స్పందిస్తూ ఇప్పటి వరకు నువ్వు అందాలను చూపిస్తూ హీరోయిన్ గా అవకాశాలు దక్కంచుకుని కెరీర్ లో ముందుకు వెళ్తున్నావు. అంతకు మించి నీ ప్రత్యేకత ఏమీ లేదు.. నీవు ఓ ఫాల్తు హీరోయిన్ అంటూ కామెంట్ చేశాడు. ఆ కామెంట్ కు తాప్సి రియాక్ట్ అయ్యింది. నీ దృష్టిలో చూపించడం అంటే ఏమిటి.. నేను ఏం చూపించాను. నేను నా ప్రతిభ చూపించాను. కాని నేను చూపించినది నీకు కనిపించదు. నీదృష్టి అంతా వేరే ఉన్నప్పుడు నేను చూపించింది నీకు ఎలా కనిపిస్తుంది అంటూ అతడిపై ఘాటుగా స్పందించాడు. ఈ అమ్మడు ప్రస్తుతం బాలీవుడ్ లో వరుసగా సినిమాలు చేస్తుంది. నటిగా ఇప్పటికే మంచి గుర్తింపును దక్కించుకున్న తాప్సిని అలాంటి మాటలు అనడం ఏమాత్రం సబబు కాదంటూ అభిమానులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.