పవన్ పోటీపై ఆర్జీవీ సెటైర్లు!

0

ఆర్జీవీ వర్సెస్ పవన్ కల్యాణ్ ఎపిసోడ్స్ తెలిసినవే. ఇప్పటికీ .. పవన్ ని ఆర్జీవీ విడువడం లేదు. ఇంతకుముందు పవర్ స్టార్ అంటూ పవన్ పై సెటైరికల్ షార్ట్ ఫిలిం తీసి డబ్బులు సంపాదించుకున్నారు. ఇప్పుడు రాజకీయాల్ని ఎన్నికల్ని టార్గెట్ చేస్తూ పవన్ పై పంచ్ లు విసురుతున్నారు.

జనసేనాని పవన్ కళ్యాణ్ గొప్ప ఎంటర్ టైనర్ అని అందువల్ల రాజకీయాల్లో తనను మాత్రమే అనుసరిస్తానని వ్యంగ్యంగా కామెంట్ చేశారు ఆర్జీవీ. పవన్ కళ్యాణ్ తప్ప తనకు రాజకీయాల గురించి ఏమీ తెలియదని ఆయన అన్నారు.

ఓ చిట్ చాట్ లో జీహెచ్ ఎంసీ ఎన్నికలకు సంబంధించిన వార్తలను అనుసరిస్తున్నారా అని యాంకర్ ప్రశ్నించారు. దానికి ఆర్జీవీ ఆన్సర్ చేశారిలా. “అవును .. నేను పవన్ కళ్యాణ్ రెండు ట్వీట్లను చూశాను. ఒకటి జిహెచ్ ఎంసీ ఎన్నికలలో పోటీ చేయడం .. మరొకటి అదే పోటీ లేకపోవడం గురించి..“ అంటూ పంచ్ వేశారు.

ఇది ప్రశంసో లేక వెటకారమో అభిమానులు ఇట్టే గుర్తు పట్టేస్తారు. అదంతా సరే కానీ జీహెచ్ ఎంసీ పోటీబరిలో దిగుతున్న పవన్ పై ఒక సెక్షన్ విమర్శలు గుప్పిస్తుండడం హద్దు మీరుతుండడం సర్వత్రా చర్చకు వస్తోంది.