Templates by BIGtheme NET
Home >> Cinema News >> మన జాతీయ మీడియాను చూస్తే జాలేస్తుంది : హరీష్ శంకర్

మన జాతీయ మీడియాను చూస్తే జాలేస్తుంది : హరీష్ శంకర్


ఇటీవల జాతీయ మీడియాలో సుశాంత్ మృతి కేసు మరియు డ్రగ్స్ కేసుకు సంబంధించిన కథనాలు ఇంటర్వ్యూలు ప్రముఖంగా వస్తున్నాయి. ఆ కేసుకు సంబందించి ఇన్వెస్టిగేషన్ రిపోర్టింగ్ ను కూడా జాతీయ మీడియా చేసి ఎన్నో రహస్యాలను చాటింగ్ లను కనిపెట్టాయి. ఆ విషయంలో అంతటి శ్రద్ద కనపబర్చిన జాతీయ మీడియా గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం మృతిపై మాత్రం ఏమాత్రం పట్టింపు లేనట్లుగా పొడి పొడి కథనాలు ప్రసారం చేసి వదిలి పెట్టారు. నిన్నంత కూడా ఎక్కువగా హీరోయిన్స్ ఎన్ సీ బీ అధికారుల ముందు హాజరు అయ్యే విషయమై కథనాలు ఇచ్చారు. 16 భాషల్లో 40 వేల పాటలు పాడి రికార్డు సాధించిన బాలు గారి గురించి అంతర్జాతీయ మీడియా సైతం ప్రత్యేక కథనాలు ప్రసారం చేస్తే జాతీయ మీడియా మాత్రం పట్టింపు లేనట్లుగా వ్యవహరించడంపై పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు.

ఈ విషయమై ప్రముఖ దర్శకుడు హరీష్ శంకర్ స్పందిస్తూ… అంతర్జాతీయ మీడియా సంస్థ బీబీసీ వరల్డ్ లో బాలు గారి పై కథనం వచ్చింది. కాని జాతీయ మీడియాలో మాత్రం రాలేదు అనే ఉద్దేశ్యంతో… ఇంటర్నేషనల్ మీడియా కూడా ఎంత అద్బుతంగా ప్రజెంట్ చేసిందో… మన నేషనల్ మీడియాను చూస్తే జాలేస్తుంది. అంతేలే కొందరి స్థాయి విశ్వవ్యాప్తం. ఇరుకు సందుల్లో కాదు అంటూ జాతీయ మీడియాను ట్రోల్ చేస్తూ కామెంట్ చేశాడు. ఆయన ట్వీట్ ను అంతా సమర్థిస్తూ కామెంట్ చేశారు.