బ్లాక్ సూట్ లో రెబల్ లాగా చెలరేగిందే

0

ఇటీవల తన శారీరక పరివర్తనపై ఓపెనప్ అయ్యింది అవికా గోర్. కొన్ని ఆకర్షణీయమైన ఫోటోలతో పాటు.. ఈ విజయం ఎలా అన్నదానిపై అవగాహన కు సంబంధించిన కొత్త పోస్ట్ లను తాజాగా పంచుకున్నారు.

“పర్సెప్షన్ దాదాపు ఎప్పుడూ వాస్తవికత కాదు.. అయినప్పటికీ మన అవగాహనతోనే ఏదైనా“ అని అవికా గురువారం ఒక ఇన్ స్టాగ్రామ్ పోస్ట్ లో రాశారు. మెరిసే వెండి దుస్తులు ధరించిన ఫోటోల్ని ఇంతకుముందు ఈ కుర్రబ్యూటీ షేర్ చేశారు.

తాజాగా అందుకు కాంట్రాస్ట్ లుక్ ఉన్న ఫోటోల్ని కూడా అవికా షేర్ చేయగా అవి సెకన్లలో వైరల్ అయిపోయాయి. ఈ ఫోటోషూట్ లో అవికాలోని రెబలిజం బయటపడింది. తన లేటెస్ట్ అల్ట్రా స్లిమ్ లుక్ దానికి తగ్గట్టే బ్లాక్ సూట్ లో రెబల్ లాగా కనిపించింది.

“నేను వివిధ విజయవంతమైన వ్యక్తులను (నటులు.. బిజినెస్ క్లాస్ వాళ్లు) చూసినప్పుడు.. వారు అదృష్టవంతులు అయ్యారని లేదా ఆశీర్వదించబడ్డారని లేదా వారు సరైన సమయంలో సరైన స్థలంలో ఉన్నారని నేను తరచుగా అనుకునేదానిని“ అని అవికా ఈ సందర్భంగా వెల్లడించింది.

చాలా కాలం పాటు నేను కూడా అదృష్టవంతురాలిని అనుకున్నాను. కానీ కాదని తర్వాతే తెలిసింది. ఇటీవల నేను నా ప్రయాణాన్ని తిరిగి విశ్లేషిస్తే.. నేను ఉన్న చోటికి వెళ్ళడానికి నేను చేయాల్సిందల్లా చేయాల్సి ఉంది. ప్రతి విజయవంతమైన వ్యక్తి నిలకడగా మెరుగ్గా రావడానికి ఎంత ప్రయత్నం చేస్తాడో నాకు అర్థమైంది. వ్యక్తిగత లక్ష్యం… వృత్తిపరమైన లక్ష్యం.. ఆర్థిక లక్ష్యం.. ఫిట్నెస్ లక్ష్యం.. మానసిక ఆరోగ్య లక్ష్యం – ఏదైనా లక్ష్యాన్ని సాధించడానికి ఎన్ని త్యాగాలు అవసరమో నేను ఇప్పుడు చూడగలను ”అని ఆమె ఇన్ స్టా పోస్టులో రాసింది. అవికాలో ఈ రెబలిజం మునుపెన్నడూ చూడనిది. తనని తాను ఎంతో లోతుగా విశ్లేషించుకుందనే అర్థమవుతోంది. ఇటీవల బిజినెస్ క్లాస్ పీపుల్స్ ని ఎనాలిసిస్ చేసినట్టే అనిపిస్తోంది. అందుకే ఈ తరహా ఫోటోషూట్ అన్నమాట.