నాని V ప్రివ్యూకి సుధీర్ బాబుని పిలవలేదా?

0

నాని V చిత్రం OTT స్క్రీనింగ్ కోసం సిద్ధంగా ఉంది. థియేట్రికల్ రిలీజ్ కుదరని పక్షంలో అమెజాన్ ప్రైమ్ లో రిలీజైపోతోంది. ఈ సీజన్ లో ఇదే పెద్ద సినిమా. అయితే ప్రచారంలో ఎక్కడా సుధీర్ బాబు పేరు మాత్రం వినిపించడం లేదు ఎందుకనో.

తాజాగా ప్రివ్యూకి ఏర్పాట్లు సాగుతున్నాయి. హైదరాబాద్ లోని ఒక ప్రముఖ ఫిల్మ్ స్టూడియోలో ప్రివ్యూ థియేటర్ ను తీసుకుని అక్కడ నాని తన కుటుంబ సభ్యులు.. ప్రియమైనవారి కోసం ఈ చిత్రాన్ని ప్రైవేటుగా ప్రదర్శిస్తున్నాడట. అతని స్నేహితులు అలానే పరిశ్రమ సహచరులు ప్రివ్యూకి విచ్చేయనున్నారని తెలిసింది. అయితే ఇలా ఎందుకు? అంటే థియేట్రికల్ అనుభూతిని కల్పించేందుకేనట.

ఓటీటీలోనే ఇది మొదటి సౌత్ బ్లాక్ బస్టర్ గా నిలుస్తుందని ఇంద్రగంటి- దిల్ రాజు బృందం నమ్మకంగా ఉన్నారట. ఎందుకంటే ఈ స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ లో దక్షిణాది చిత్రాలు ఏవీ సరిగా ఆడలేదు. వాటి గురించిన వివాదాలు వైరల్ అయ్యాయి తప్ప సినిమా బావుంది అని ఎవరూ చెప్పుకోలేదు. కొద్దో గొప్పో క్రేజు ఉన్న మూవీ గా వీ విడుదలకు సిద్ధమవుతోంది. ఇకపోతే సుధీర్ బాబు కూడా ప్రివ్యూకి వచ్చి ప్రచారంలో స్పీడ్ పెంచుతాడేమో చూడాలి.