ప్రభాస్ బాటలో నితిన్…?

0

యూత్ స్టార్ నితిన్ ప్రస్తుతం ”రంగ్ దే” అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ లో నితిన్ కి జోడీగా మహానటి కీర్తి సురేష్ నటిస్తోంది. వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని పీడీవీ ప్రసాద్ సమర్పణలో సితార ఎంటర్టైమెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. ఇప్పటికే మెజారిటీ భాగం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేసుకున్నారు. కరోనా పరిస్థితుల కారణంగా షూటింగ్ నిలుపుదల చేసుకున్న ‘రంగ్ దే’ ఇటీవలే హైదరాబాద్ లో తిరిగి ప్రారంభమైంది. ఈ షూట్ పూర్తయిన తరువాత మూవీ టీమ్ ఫారిన్ షెడ్యూల్ ప్లాన్ చేసారని తెలుస్తోంది.

ఈ నేపథ్యంలో ‘రంగ్ దే’ టీమ్ మూడు వారాల షెడ్యూల్ కోసం ఇటలీకి వెళ్లనుందని సమాచారం. దీని కోసం ప్రస్తుతం వీసా ఫార్మాలిటీలు చూస్తున్నారు. ఇటలీ షెడ్యూల్ లో కొన్ని కీలక సన్నివేశాలతో పాటు రెండు పాటలు కూడా చిత్రీకరించనున్నారు. అందుకు అక్టోబర్ చివరి వారంలో ఇటలీ పయనమవుతారని తెలుస్తోంది. ఇప్పటికే యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ‘రాధే శ్యామ్’ షూటింగ్ కోసం ఇటలీ వెళ్లిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ప్రభాస్ బాటలో నితిన్ కూడా వెళ్లనున్నాడు. వివాహం అనంతరం నితిన్ వెళ్లే ఫారిన్ ట్రిప్ ఇదేనని చెప్పవచ్చు. ఇక ఈ చిత్రానికి రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నాడు. పీసీ శ్రీరామ్ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ‘రంగ్ దే’ ఫస్ట్ లుక్ మరియు నితిన్ మ్యారేజ్ నాడు రిలీజ్ చేసిన స్పెషల్ వీడియోకి మంచి స్పందన వచ్చింది. నితిన్ ‘రంగ్ దే’ షూట్ కంప్లీట్ చేసి ‘అంధాదున్’ తెలుగు రీమేక్ స్టార్ట్ చేయనున్నాడు.