సతీమణి సమంత అక్కినేని బాటలోనే

0

సతీమణి సమంత అక్కినేని బాటలోనే చైతూ కూడా వెళుతున్నాడా? అంటే అవుననే సమాచారం. త్వరలోనే నాగచైతన్య ఓ వెబ్ సిరీస్ లో నటించనున్నాడని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే సమంత మొట్టమొదటి వెబ్ సిరీస్ ‘ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2’ దసరా బరిలో అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రసారం అవుతుంది.

ఈలోగానే సామ్ బాటలోనే చైతూ కూడా వెబ్ సిరీస్ కి సంతకం చేసేందుకు సిద్ధమవుతుండడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. ప్రముఖ వెబ్ స్ట్రీమింగ్ సంస్థ ప్రస్తుతం చైతూతో చర్చలు జరుపుతోంది. ఆల్మోస్ట్ సిరీస్ లో నటించడానికి ఓకే చెప్పేసినట్టేనని ఫిలింనగర్ టాక్. సినిమాలు చేస్తున్నా వెబ్ సిరీస్ లతో దక్కుతున్న పాపులారిటీ వేరే లెవల్లో ఉంటోంది. ఎందుకంటే అవి ప్రపంచవ్యాప్తంగా బాగా ప్రాచుర్యం పొందుతున్నాయి. అన్ని భాషల ఆడియెన్ కి చేరువ అవుతున్నాయి. అలా ఇప్పటికే హిందీ వాళ్లు తెలుగు వారికి సుపరిచితం అయిపోతున్న వైనం గమనిస్తున్నదే. తాజా ఒప్పందంపై చైతూ స్వయంగా వెల్లడించనున్నాడట.

మరోవైపు నాగ చైతన్య ప్రస్తుతం శేఖర్ కమ్ముల ‘లవ్ స్టోరీ’ లో నటిస్తున్నారు. ఇది డిసెంబర్ 2020 లేదా సంక్రాంతి 2021 విడుదలవుతుంది. అలాగే విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ‘థాంక్స్’ చిత్రీకరణను వచ్చే ఏడాది ప్రారంభంలో ప్రారంభించనున్నారని తెలుస్తోంది.