పవర్ స్టార్ పొలిటికల్ జర్నీ స్ఫూర్తితో మెగా మేనల్లుడి మూవీ…?

0

మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ – ‘ప్రస్థానం’ దేవకట్టా కాంబినేషన్ లో ఓ సినిమా స్టార్ట్ అయిన సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ చేతులు మీదుగా లాంఛనంగా ప్రారంభమైన ఈ చిత్రాన్ని జె.బి.ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై జె.భగవాన్ – జె.పుల్లారావు నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో తేజ్ క్యారెక్టర్ చాలా కొత్తగా ఉంటుందని.. ఇప్పటి వరకు అతని కెరీర్లో ట్రై చేయని జోనర్ అని.. నటుడిగా మెగా హీరోని మరో స్థాయికి తీసుకుపోయే సినిమా అవుతుందని ఫిలిం సర్కిల్స్ టాక్ నడుస్తోంది. ఈ క్రమంలో తేజ్ – దేవకట్టా ప్రాజెక్ట్ కి సంబంధించిన ఓ న్యూస్ చక్కర్లు కొడుతోంది.

పొలిటికల్ బ్యాక్ డ్రాప్ తో ”ప్రస్థానం” సినిమా తీసి సంచలనం సృష్టించిన దేవా కట్టా.. ‘ఇంద్రప్రస్థం’ అనే ఫిక్షనల్ పొలిటికల్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ని అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇప్పుడు తేజ్ తో తీయబోతున్న చిత్రాన్ని కూడా పొలిటికల్ నేపథ్యంలోనే తెరకెక్కించనున్నారట. అంతేకాకుండా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రయాణానికి ప్రేరణగా ఈ సినిమాని తీస్తున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో అనుకుంటున్నారు. ఇప్పటివరకు యూత్ ఫుల్ స్టోరీస్ తో ప్రేక్షకుల ముందుకొచ్చిన తేజ్.. ఇప్పుడు పొలిటికల్ థ్రిల్లర్ తో వస్తుండటం అందరి దృష్టిని ఆకరిస్తోంది.

తేజ్ కెరీర్ లో 14వ చిత్రంగా తెరకెక్కనున్న ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది. ఈ సినిమాకి ”రిపబ్లిక్” అనే టైటిల్ ని పరిశీలిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. కాగా ‘చిత్రలహరి’ ‘ప్రతిరోజూ పండగే’ వంటి వరుస హిట్స్ అందుకున్న సాయి ధరమ్ తేజ్.. సుబ్బు దర్శకత్వంలో తెరకెక్కిన ‘సోలో బ్రతుకే సో బెటర్’ చిత్రాన్ని విడుదలకి సిద్ధం చేశాడు. ఇటీవలే కార్తీక్ వర్మ దండు దర్శకత్వంలో ఓ మిస్టికల్ థ్రిల్లర్ లో నటించనున్నట్లు తేజ్ ప్రకటించాడు. ఏదేమైనా చిరంజీవి మేనల్లుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన సాయి తేజ్.. తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకోడానికి కష్టపడుతున్నాడని చెప్పవచ్చు.