హోమ్ బ్యానర్ లో న్యూ మూవీ స్టార్ట్ చేసిన నాగశౌర్య..!

0

టాలీవుడ్ యువ హీరో నాగశౌర్య ఇటీవలే హోమ్ బ్యానర్ లో ప్రొడక్షన్ నెం.4 ప్రాజెక్ట్స్ ని అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన కాన్సెప్ట్ పోస్టర్ ని విడుదల చేస్తూ ‘అలా ఎలా’ ‘లవర్’ చిత్రాల దర్శకుడు అనీష్ కృష్ణ ఈ చిత్రాన్ని రూపొందించనున్నాడని అధికారికంగా ప్రకటించారు. తాజాగా ఈ చిత్రాన్ని పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభించారు. స్టార్ డైరెక్టర్ కొరటాల శివ నాగశౌర్యపై క్లాప్ ఇవ్వగా.. మరో స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి ఫస్ట్ షాట్ కి గౌరవ దర్శకత్వం వహించారు. హీరో నారా రోహిత్ కెమెరా స్విచ్ ఆన్ చేయగా.. సితారా ఎంటెర్టైన్మెంట్స్ నాగవంశీ స్క్రిప్ట్ ని డైరెక్టర్ చేతికి అందించారు.

రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని శంకర్ ప్రసాద్ మల్పూరి సమర్పణలో ఐరా క్రియేషన్స్ బ్యానర్ పై ఉషా మల్పూరి నిర్మించనున్నారు. నాగశౌర్య హోమ్ ప్రొడక్షన్ లో 4వ ప్రాజెక్ట్ గా వస్తున్న ఈ చిత్రానికి బుజ్జి కో ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు. ‘ఛలో’ సినిమాకు సూపర్ హిట్ ఆల్బమ్ అందించిన సాగర్ మహతి ఈ చిత్రానికి సంగీతం సమకూర్చనున్నారు. శౌర్య కెరీర్ లో 22వ చిత్రంగా రానున్న ఈ మూవీ ప్రస్తుతం ఆయన నటిస్తున్న చిత్రాలకు పూర్తి భిన్నంగా క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపొందనుందని తెలుస్తోంది. ఈ సినిమాలో నటించే ఇతర నటీనటులు సాంకేతిక నిపుణులు వివరాలు త్వరలోనే వెల్లడించనున్నారు.