సంక్రాంతికి ‘రెడ్’ ఉందా? లేదా?

0

రామ్ హీరోగా తిరుమల కిషోర్ దర్శకత్వంలో రూపొందిన రెడ్ సినిమా ఈ ఏడాది ఆరంభంలోనే విడుదల చేయాలనుకున్నా కూడా కరోనా వల్ల ఆలస్యం అయ్యింది. సినిమా షూటింగ్ దాదాపుగా ముగిసి విడుదల చేద్దాం అనుకుంటున్న సమయంలో థియేటర్లు మూత పడ్డాయి. దాంతో సినిమాకు ఓటీటీ ఆఫర్ వచ్చింది. కాని థియేటర్లలోనే విడుదల చేయాలని భావించారు. అందుకోసం ఇన్నాళ్లు వెయిట్ చేశారు. సినిమాకు ప్రముఖ ఓటీటీ ఫ్యాన్సీ ఆఫర్ ఇచ్చినా కూడా మేకర్స్ నో చెప్పారు. సంక్రాంతి వరకు థియేటర్లు పునః ప్రారంభం అయితే ఖచ్చితంగా సినిమాను ఆ సమయంలో విడుదల చేయాలని భావించారు. కాని థియేటర్లు ఓపెన్ అవుతున్నా కూడా సినిమా విడుదల విషయంలో మాత్రం క్లారిటీ ఇవ్వడం లేదు.

రెడ్ సినిమాను సంక్రాంతికి విడుదల చేసే విషయమై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఎందుకంటే సినిమా విడుదల విషయమై ఇప్పటికే తేదీ ప్రకటించాల్సి ఉంది. ఇప్పటికే సంక్రాంతి సినిమాలు కొన్ని డేట్ ను కూడా ప్రకటించాయి. కాని రెడ్ సినిమాకు మాత్రం ఇంకా తేదీ ప్రకటించలేదు. కనుక సినిమా విడుదల ఉందా లేదా అనే అనుమానాలు అందరిలో కనిపిస్తున్నాయి. భారీ ఎత్తున అంచనాలున్న ఈ సినిమాతో రామ్ మరో మాస్ హిట్ ను దక్కించుకుంటాను అనే నమ్మకంతో ఉన్నాడు. రామ్ గత సినిమా ఇస్మార్ట్ శంకర్ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. కనుక ఈ సారి మరో విజయాన్ని ఆయన కొట్టడం ఖాయం అన్నట్లుగా అభిమానులు అంతా కూడా వెయిట్ చేస్తున్నారు.