నాభితో నాగిని నృత్యం .. జాన్వీ మెరుపులు!

0

కరీనా కపూర్ ఖాన్ పాటకు జాన్వి కపూర్ బెల్లీ డాన్స్ ట్విస్ట్ అనూహ్యంగా అంతర్జాలంలో సునామీలా మారింది. ఈ వీడియోలో జాన్వి అద్భుతమైన బెల్లీ డ్యాన్స్ నైపుణ్యం మైమరిపించింది. ఒకరకంగా చెప్పాలంటే బాహుబలి మనోహరి నోరా ఫతేహి.. గాబ్రియేలా రేంజులోనే బెల్లీ నృత్యంతో మెరుపులు మెరిపించింది ఈ కుర్రబ్యూటీ.

తన సోషల్ మీడియా పోస్టులతో అభిమానుల హృదయాలను పదే పదే గెలుచుకున్న జాన్వీ సడెన్ గా ఇలాంటి ట్విస్టిస్తుందన్నది ఊహించలేదు ఎవరూ. కొరోనావైరస్ పై అవగాహన కోసం ఇటీవల ప్రచారం .. కొన్ని సరదా వీడియోలు మాత్రమే ఇటీవల కనిపించాయి. కొంత గ్యాప్ తర్వాత ఇలా బెల్లీ డ్యాన్స్ వీడియోతో సడెన్ సర్ ప్రైజ్ ఇచ్చింది జాన్వీ. `అశోకా` చిత్రంలోని కరీనా కపూర్ ఖాన్ పాటకు జాన్వి తన బెల్లీ డాన్స్ పర్ఫెక్ట్ యాప్ట్ అయ్యింది.

పాట ఆద్యంతం నాభి కుదుపుడు నడుము ఊపుడుతో జాన్వీ విన్యాసాలు కిర్రాక్ పుట్టిస్తున్నాయి. జాన్వీ నృత్య కదలికలు ఎక్స్ ప్రెషన్స్ మైమరిపించాయి.

ఇంతకుముందు కూడా జాన్వి కి డ్యాన్స్ పై ఉన్న గ్రిప్ పై అభిమానులకు అవగాహన ఉంది. తను అనేక పాత పాటలలో శాస్త్రీయ నృత్యాలతో అలరించిన వీడియోల్ని ఇన స్టాలో షేర్ చేసింది. ఆ వీడియోలు ఎల్లప్పుడూ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

ఇక కెరీర్ సంగతి చూస్తే.. తాజా చిత్రం `గుడ్ లక్ జెర్రీ` షూటింగ్ ను ఇటీవల ప్రారంభించగా సెట్స్ లో జాయిన్ అయ్యింది. ఈ చిత్రానికి సిద్ధార్థ్ సేన్ దర్శకుడు. ఆనంద్ ఎల్ రాయ్ నిర్మిస్తున్నారు. కార్తీక్ ఆర్యన్ తో దోస్తానా 2 లోనూ నాయికగా నటిస్తోంది.

Wow! #JanhviKapoor’s belly dancing skills are too good!