‘మహానటి’ మేకర్స్ ‘జాతిరత్నాలు” రెడీ అయినట్లేనా…?

0

టాలెంటెడ్ యువ హీరో నవీన్ పోలిశెట్టి ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. కెరీర్ స్టార్టింగ్ లో సపోర్టింగ్ రోల్స్ చేస్తూ వచ్చిన నవీన్.. ‘ఏజెంట్ సాయిశ్రీనివాస’ సినిమాతో సాలిడ్ హిట్ అందుకున్నాడు. ఇదే క్రమంలో ‘దంగల్’ దర్శకుడు నితీష్ తివారి దర్శకత్వంలో దివంగత సుశాంత్ సింగ్ రాజ్ పుత్ హీరోగా నటించిన ‘చిచ్చోరే’ సినిమాలో నవీన్ కీలక పాత్రలో నటించాడు. ఈ రెండు సినిమాలలో అతడి కామెడీ టైమింగ్ తో యూత్ ఆడియన్స్ లో క్రేజ్ ఏర్పరచుకున్నాడు. ఆ క్రేజ్ నిలబెట్టుకునే క్రమంలో ‘జాతిరత్నాలు’ అనే కామెడీ ఎంటర్టైనర్ సినిమా చేశాడు.

‘మహానటి’ చిత్రాన్ని రూపొందించిన నాగ్ అశ్విన్ ఈ చిత్రాన్ని స్వప్న సినిమాస్ బ్యానర్ లో నిర్మించాడు. అనుదీప్ కేవీ దర్శకత్వం వహించారు. హాస్యనటులు రాహుల్ రామకృష్ణ – ప్రియదర్శి ఇతర ప్రధాన పాత్రలు పోషించారు. ఎప్పుడో విడుదల కావాల్సిన ఈ సినిమా కరోనా కారణంగా వాయిదాపడింది. అయితే తాజా సమాచారం ప్రకారం ‘జాతిరత్నాలు’ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు అన్ని పూర్తి చేసుకుందని తెలుస్తోంది. ఫస్ట్ కాపీ చూసిన మేకర్స్ అవుట్ ఫుట్ బాగా వచ్చిందని.. సినిమా హిట్ అవుతుందని ధీమాగా ఉన్నారట. ఏదేమైనా ఈ సినిమా హిట్ అయితే నవీన్ పోలిశెట్టి టాలీవుడ్ లో క్రేజీ హీరోగా మారే అవకాశాలు ఉన్నాయని చెప్పవచ్చు.