హరికృష్ణ జయంతి..భావోద్వేగానికి లోనైన ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్..!

0

నందమూరి తారకరామారావు వారసుడిగా నటుడుగా రాజకీయ నాయకుడిగా తెలుగు ప్రజల్లో చెరగని ముద్రవేశారు నందమూరి హరికృష్ణ. వెండితెర ‘సీతయ్య’గా.. సౌమ్యుడిగా అభిమానుల గుండెల్లో శాశ్వత స్థానాన్ని ఏర్పరచుకున్న హరికృష్ణ 2018 ఆగస్టు 29న జరిగిన రోడ్డు ప్రమాదంలో కన్నుమూశారు. ఆయన మృతి నందమూరి అభిమానులతో పాటు కుటుంబ సభ్యులకు తీరని శోకాన్ని మిగిల్చింది. నేడు హరికృష్ణ 64వ జయంతి సంధర్భంగా ఆయన తనయులు జూనియర్ ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్ భావోద్వేగానికి లోనయ్యారు. ఎన్టీఆర్ మరియు కళ్యాణ్ రామ్ తమ తండ్రిని స్మరించుకుంటూ.. హరికృష్ణ ఫొటోతో పాటు కొన్ని మనసులోని భావాలను వ్యక్తపరిచారు.

“ఈ అస్తిత్వం మీరు. ఈ వ్యక్తిత్వం మీరు. మొక్కవోని ధైర్యంతో కొనసాగే మా ప్రస్థానానికి నేతృత్వం మీరు. ఆజన్మాంతం తలుచుకునే అశ్రుకణం మీరే – నందమూరి కళ్యాణ్ రామ్ – నందమూరి తారకరామారావు” అంటూ ట్విట్టర్ లో ఎమోషనల్ పోస్ట్ చేసారు. “మీ 64వ జయంతి న మిమ్మల్ని స్మరించుకుంటూ… Miss You Nanna!” అని పేర్కొన్నారు. నారా రోహిత్ సైతం ట్విట్టర్ లో ”హరిమామ జయంతి సందర్భంగా ఆయన్ని స్మరించుకుంటూ…” అంటూ హరికృష్ణ ఫొటోని షేర్ చేశాడు.