Templates by BIGtheme NET
Home >> Cinema News >> ఆ ఒక్కటి అడక్కు.. కాఫీ తాగుదాం ప్లీజ్: ఎన్టీఆర్

ఆ ఒక్కటి అడక్కు.. కాఫీ తాగుదాం ప్లీజ్: ఎన్టీఆర్


టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్.. తాజాగా ‘ఎవరు మీలో కోటీశ్వరుడు’ రియాలిటీ షో ప్రమోషన్లలో భాగంగా లైవ్ ఇంటర్వ్యూకు హాజరయ్యాడు. ఈ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికరమైన విషయాలను బయటపెట్టాడు. ఇంటర్వ్యూలో ఓ విలేకరి.. ‘అభిమానుల కోరిక మేరకు రాజకీయాల్లోకి వస్తారా..?’ అని ప్రశ్నించడం జరిగింది. ఆ ప్రశ్నకు జూనియర్ ఎన్టీఆర్ తెలివిగా ప్రశ్నను దాటవేసే ప్రయత్నం చేసాడు. ‘ఇప్పటికి చాలా ఇంటర్వ్యూలలో ఈ ప్రశ్నకు సమాధానం చెప్పినందున.. ఇప్పుడు తన సొంతప్రశ్నకు సమాధానం ఇవ్వమని ఎన్టీఆర్ మీడియా వ్యక్తిని తిరిగి ప్రశ్నించాడు. మొత్తానికి ఫన్నీ టాక్ లాగే వారి మధ్య సంభాషణ జరిగింది. చివరగా ఎన్టీఆర్ రాజకీయాల్లోకి ప్రవేశించడం గురించి మాట్లాడటానికి ఇది సరైన సమయం కాదని అలాగే సరైన సిట్యుయేషన్ కూడా కాదని చెప్పుకొచ్చాడు.

నందమూరి అభిమానులు ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలని కోరుకుంటుండగా.. ప్రస్తుతం టాలీవుడ్లో ఆయనకు చాలా క్రేజ్ పరంగా ఎన్టీఆర్ సినిమాల్లోనే ఉంటారని చాలామంది భావిస్తున్నారు. అయితే ఈ హీరో తన అభిమానుల సందేహాలకు మాత్రం సమాధానం ఇవ్వలేదు. తన రాజకీయ ప్రవేశం గురించి చర్చించడానికి తనకు పూర్తిరోజు అవసరమని చెప్పాడు. అలాగే ఆ విషయం గురించి తీరిగ్గా కాఫీ తాగుతూ తర్వాత మాట్లాడుదాం అంటూ విలేకరితో చెప్పడం ప్రస్తుతం సినీవర్గాల్లో చర్చలకు దారితీస్తోంది. ఇదివరకు ఎన్టీఆర్ ను చంద్రబాబు నాయుడు పార్టీపరంగా రాజకీయ కార్యకలాపాల్లో వాడుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే విషయం గుర్తొచ్చి ఎన్టీఆర్ రాజకీయం గురించి మాట్లాడేందుకు వెనకడుగు వేస్తున్నాడని కథనాలు వినిపిస్తున్నాయి. మరి ఏ విధంగా ఎన్టీఆర్ ప్రశ్నను దాటవేశాడో తెలియాల్సి ఉంది. ప్రస్తుతం ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ సినిమాలో నటిస్తున్నాడు. ఆ సినిమా అక్టోబర్ 13న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.