Templates by BIGtheme NET
Home >> Cinema News >> ఉడుకు వయసు దుడుకుతనము నిలువదు…!!

ఉడుకు వయసు దుడుకుతనము నిలువదు…!!


జల్లంత కవ్వింత కావాలిలే.. ఒళ్ళంత తుళ్ళింత రావాలిలే.. జల్లంత కవ్వింత కావాలిలే .. ఒళ్ళంత తుళ్ళింత రావాలిలే.. ఉరుకులో పరుగులో ఉడుకు వయసు దుడుకుతనము నిలువదు…!!

ఈ భామను చూస్తుంటే గీతాంజలి గీతలో స్పీడ్ గుర్తుకు రావడం లేదూ? మణి సర్ అలాంటి ఓ అవకాశం ఇస్తే నిరూపించుకునేందుకు బాలీవుడ్ నవనాయిక ఐషా శర్మ చాలా కాలంగా వేచి చూస్తోంది. కానీ ఆ ఒక్క ఛాన్స్ తనని వరించడం లేదు. అందుకే నిరంతరం తన సోదరి నేహాశర్మతో కలిసి ఇన్ స్టా వేదికగా జనాల కంటికి కునుకుపట్టనివ్వని ట్రీటిస్తోంది.

ఏదో ఒకటి చేయాలి ఇక్కడ. రంగుల మాయా ప్రపంచంలో వెలగాలంటే అవకాశాలు రావాలంటే ఎప్పుడూ ఎటెన్షన్ తమవైపే తిప్పేసుకోవాలి. ఆ ఒక్కటే ఐషా తపన. ఆ క్రమంలోనే వరుస ఫోటోషూట్లతో విరుచుకుపడుతోంది. తాజాగా ఐషా రెడ్ ఫ్లోరల్ డిజైనర్ డ్రెస్ లో తళుకుబెళుకులు ప్రదర్శించింది. చక్కనమ్మ థై సోష్ .. క్రీగంటి చూపులకు కుర్రకారు గుండెల్లో గుబులు రేగుతోంది.

ఈ రేంజులో ఈ అమ్మడి తపన చూస్తుంటే .. ఏదో ఒకరోజు అది ఫలించి మణిరత్నమో.. శంకరో లేకపోతే ఇంకా ఎవరైనా సౌత్ స్టార్ డైరెక్టర్ అవకాశం ఇస్తారనే అనిపిస్తోంది. సోదరి నేహాశర్మ ఇటువైపు చూడకపోయినా ఐషాకు ఇక్కడ ఛాన్సులిస్తారేమో చూడాలి. ఇక్కడ వెలిగితేనే ముంబై పరిశ్రమలో గొప్ప. అప్పుడు అక్కడా అవకాశాలిస్తారు. ఇప్పుడున్న దీపిక.. కత్రిన వీళ్లంతా అలా వెలుగుతున్నవారే. అదే బాటలో ఐషా శర్మ కూడా ముంబై పరిశ్రమలో వెలగాలంటే సౌత్ లో సరైన ఆఫర్ పడాలి.