ఆది సాయికుమార్ హారర్ మూవీ ‘జంగిల్’ ఫస్ట్ లుక్..!

0

సీనియర్ నటుడు సాయికుమార్ తనయుడిగా ఇండస్ట్రీలో అదిగుపెట్టిన ఆది సాయికుమార్.. హీరోగా తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నాడు. ఈ క్రమంలో ఆది నటిస్తున్న లేటెస్ట్ మూవీ “జంగిల్”. ఇందులో ఆది సరసన హీరోయిన్ వేదిక నటించింది. హారర్ జోనర్ లో రూపొందుతోన్న ఈ చిత్రానికి కార్తీక్ – విఘ్నేష్ దర్శకత్వం వహిస్తున్నారు. రణవీర్ కుమార్ సమర్పణలో న్యూ ఏజ్ సినిమా మరియు ఆరా సినిమాస్ బ్యానర్స్ పై మహేశ్ గోవిందరాజ్ – అర్చనా చందా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో నోయరిక – లల్లు – మధుసూదన్ రావు – జై కుమార్ తదితరులు నటించారు. తాజాగా ‘జంగిల్’ చిత్ర ఫస్ట్ లుక్ ని చిత్ర యూనిట్ విడుదల చేసింది.

‘జంగిల్’ ఫస్ట్ లుక్ పోస్టర్ లో వేదిక ఓ లాంతరు పట్టుకొని ఉండగా.. ఆ వెలుగులో ఆది ఏదో చూస్తూ షాక్ కి గురవుతున్నట్లు కనిపిస్తున్నాడు. చిమ్మ చీకటిగా ఉన్న ఓ ప్రాంతంలో చుట్టూ అస్థిపంజరాలతో ఫస్ట్ లుక్ తోనే సినిమాపై ఆసక్తిని కలిగిస్తున్నారు. ‘జంగిల్’ టైటిల్ కి ‘ఇది శ్వాసిస్తుంది.. ఇది దాక్కొని ఉంటుంది.. ఇది వేటాడుతుంది’ అనే క్యాప్షన్ తోనే ఈ సినిమాలో ఏదో భయంకరమైన జంతువో.. దెయ్యమో ఉండబోతుందనే ఇంట్రెస్ట్ క్రియేట్ చేశారు. ఈ చిత్రానికి గౌతమ్ జార్జ్ సినిమాటోగ్రఫీ అందించగా శివ నందీశ్వరన్ ఎడిటింగ్ వర్క్ చేశారు. జోస్ ఫ్రాంక్లిన్ సంగీతం సమకూర్చారు. డిఫరెంట్ కంటెంట్ తో వస్తున్న ‘జంగిల్’ సినిమా చిత్రీకరణ ఇప్పటికే పూర్తి చేసుకుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటోంది. త్వరలోనే ఈ మూవీ టీజర్ మరియు సినిమా విడుదల తేదీని మేకర్స్ ప్రకటించనున్నారు.