ఈ వీడియో చూశాక కన్నీళ్లు వచ్చాయన్న పూరి

0

తమ అభిమాన హీరో సినిమా ఫస్ట్ డే.. ఫస్ట్ షో చూసే అభిమానులు కోట్లలో ఉంటారు. థియేటర్లు అంతా హౌస్ ఫుల్ తో నిండిపోయేవి. కానీ ఎక్కడి నుంచి వచ్చిందో ఈ మహమ్మారి కరోనా అన్నింటిని మూతపడేసింది. కరోనా వైరస్ తో అన్ని రంగాలతోపాటు సినీ రంగం కూడా తీవ్రంగా దెబ్బతింది. అన్ని రంగాలు మళ్లీ రికవరీ అయినా సినీ పరిశ్రమ మాత్రం ఇప్పటికీ కోలుకోవడం లేదు.

సినిమా థియేటర్లు తెరిచేందుకు ప్రభుత్వాలు అనుమతిచ్చినా జనాలు రావడం లేదు.థియేటర్లలో సినిమాలు పడడం లేదు. అన్ లాక్ అయినా థియేటర్లు తెరిచే పరిస్థితులు కనిపించడం లేదు. కరోనా భయానికి జనాలు థియేటర్లకు వచ్చే ధైర్యం చేయడం లేదు.దీంతో సినీ నిర్మాతలు కూడా తమ సినిమాలను వాయిదా వేస్తున్నారు. కొందరు ఓటీటీల్లో రిలీజ్ చేస్తున్నారు.

ఈ నేపథ్యంలోనే కన్నడ చిత్ర పరిశ్రమ చొరవ తీసుకుంది. ‘కమ్.. లెట్స్ సెలబ్రేట్ సినిమా అగైన్’ అనే పేరుతో ఓ వీడియోను రూపొందించింది. ఇది వైరల్ అయ్యింది.

ఈ వీడియోను షేర్ చేసిన పూరి జగన్నాథ్ ఎమోషనల్ అయ్యారు. ‘ఈ వీడియో చూశాక కన్నీళ్లు వచ్చాయి. మళ్లీ ఆ రోజులు రావాలి. విజిల్స్ వేయాలి. పేపర్స్ ఎగరాలి. చొక్కాలు చిరగాలి. సినిమా థియేటర్.. మన అమ్మా’ అని పేర్కొంటూ ఆ వీడియోను షేర్ చేశారు.