వదిలితే ఐపీఎల్ ఆడేట్టున్నాడు జూనియర్ పాండ్యా

0

అవును .. అచ్చం జూనియర్ హార్దిక్ పాండ్యాలా ఉన్నాడు కదూ!.. నోనో.. జూనియర్ టింగురంగడు అలియాస్ జూ.పాండ్యాలా ఉన్నాడని అంటారా? అయితే ఓకే…!! ది గ్రేట్ టీమిండియా ఆల్ రౌండర్ హార్థిక్ పాండ్యా కి గ్రేట్ గిఫ్ట్ ఇచ్చాడు గాడ్. అదే మాటను చెప్పుకుని తెగ మురిసిపోతున్నాడు పాండ్యా.

వారసుడు అగస్త్యను తన ‘గొప్ప బహుమతి’ అని పిలిచే అతడు ఇప్పుడు ..ఎంత మురిపెంగా ఉన్నాడో మరి. హార్దిక్ పాండ్యా – అతని భార్య నటాసా స్టాంకోవిక్ తరచుగా తమ కుమారుడు అగస్త్య పాండ్యా ఫోటోలు వీడియోలను సోషల్ మీడియాలో పంచుకోవడం చూస్తున్నదే. ఈ సిరీస్ లో లేటెస్ట్ ఫోటో అంతర్జాలంలో సునామీ స్పీడ్ తో దూసుకుపోతోంది.

పాండ్యా అభిమానులు ఈ ఫోటోకి అదిరిపోయే క్యాప్షన్స్ ఇస్తున్నారు. అచ్చం జూనియర్ టింగురంగడు పాండ్యా లుక్కిదే అంటూ వ్యాఖ్యల్ని జోడిస్తున్నారు సోషల్ మీడియాల్లో. ప్రస్తుతం ఇండియన్ ప్రీమియర్ లీగ్లో ముంబై ఇండియన్స్ తరపున ఆడుతున్నందున భారత క్రికెటర్ హార్దిక్ పాండ్యా ప్రస్తుతం యుఎఇలో ఉన్నారు. ఈ సంవత్సరం తండ్రి అయిన స్టార్ క్రికెటర్ తన పితృత్వ ప్రయాణంలో ప్రతి బిట్ ని ఆనందిస్తున్నాడు. అతను భార్య నటాసా స్టాంకోవిక్ తరచుగా వారి కుమారుడు అగస్త్య పాండ్యా వీడియోలను వారి సోషల్ మీడియా హ్యాండిల్స్ లో పంచుకుంటున్నారు. ఈ సిరీస్ లో హార్దిక్ షేర్ చేసిన తాజా ఫోటో ఇది. అతను చిత్రాన్ని పంచుకున్న వెంటనే తల్లి నటాసా తన పోస్ట్లో గుండె ఎమోజీలను షేర్ చేసింది. కొలీగ్స్ క్రికెటర్లు కె.ఎల్.రాహుల్.. ఇషాన్ కిషన్- ప్రముఖ ఫిట్నెస్ ట్రైనర్ యాస్మిన్ కరాచీవాలా తదితరులు కూడా హార్దిక్ పోస్ట్ పై వ్యాఖ్యానించారు.

నటాసా – హార్దిక్ జూలై 30 న తమ కుమారుడు అగస్త్యకు స్వాగతం పలికారు. కొద్ది రోజుల క్రితం నటాసా స్టాంకోవిక్ కూడా తన సోషల్ మీడియా హ్యాండిల్ లో బేబీ అగస్త్యతో అరుదైన వీడియోను పంచుకున్నారు. వీడియోలో తల్లి-కొడుకు ద్వయం సరదా మూడ్ లో కనిపించారు. మా జీవితంలోని ఒక కొత్త అడుగు అంటూ ఈ జంట ఎంతో హుషారును కనబరిచారు.