కాజల్ ప్రేమబంధం ఇప్పటిది కాదా?

0

గత త్రీ డేస్ గా సోషల్ మీడియాలో కాజల్ అగర్వాల్ లవ్ స్టోరీ గురించే చర్చ. ఈ అందాల చందమామ పెళ్లి గురించి గత ఏడాది కాలంగా నెట్టింట్లో వరుసగా వార్తా కథనాలు వినిపిస్తూనే వున్నాయి. కానీ వరుడు ఎవరన్నది మాత్రం స్పష్టంగా తెలియకపోవడంతో నెలల తరబడి కాజల్ పెళ్లిపై చర్చ జరుగుతూనే వుంది. కాజల్ ఈ వార్తల్ని లైట్ తీసుకుంటూ వచ్చింది.

ఇటీవల కాజల్ పెళ్లి వార్తలు మరింత జోరుగా వినిపించడం.. ఏకంగా కాజల్ చేసుకోబోయే వ్యక్తి పేరు.. వృత్తి వంటి విషయాలు బయటికి రావడంతో కాజల్ అగర్వాల్ ఫైనల్ గా `యస్ గౌతమ్ కిచ్లూని వివాహం చేసుకోబోతున్నాను. అక్టోబర్ 30న మా వివాహం ముంబైలో అత్యంత సన్నిహితుల మధ్య జరగబోతోంద’ ని వెల్లడించి షాకిచ్చింది.

అయితే తాజాగా కాజల్ ఇన్ స్టాలోని ఫొటోలు ఓ విషయాన్ని స్పష్టం చేశాయి. సమంత నాగచైతన్య తరహాలో కాజల్ అగర్వాల్ తను ప్రేమించి పెళ్లి చేసుకోబోతున్న గౌతమ్ కిచ్లూతో ఏడెనిమిదేళ్ల నుంచే ప్రేమలో వుందని తెలుస్తోంది. కొన్నేళ్ల క్రితం ఓ పార్టీలో గౌతమ్ కిచ్లూతో కలిసి దిగిన కాజల్ ఫొటోని బట్టి చూస్తే ఈ విషయం స్పష్టమవుతోంది. అంటే కాజల్ ప్రేమ బంధం ఇప్పటికి కాదన్నమాట.