కాజల్ హోటల్లో ప్రతి విశేషాన్ని రివీల్ చేస్తోంది

0

కొందరు నవ్వితే ఆ అందమే వేరు. చూసీ చూడగానే గుండె లయ తప్పుతుంది. అలాంటి అందమైన నవ్వు కాజల్ సొంతం. ఆ స్మైలీ ఫేస్ అభిమానులు ఎప్పటికీ మర్చిపోలేనిది. చందమామ అన్న ట్యాగ్ కి తగ్గట్టే ఎంతో మంచి మనసున్న కాజల్ ఏం చేసినా అది అభిమానుల గుండెలకు హత్తుకుంటుంది.

ఆంధ్రా ఊటీ అరకులో గిరిజన విద్యార్థులకు స్కూల్ కట్టించి విద్యాబుద్ధులు నేర్పించినా .. బీద విద్యార్థుల పోషణ చూసుకున్నా.. అలాగే నిరుపేద బాలికల శ్రేయస్సు కోసం ప్రత్యేకించి నిధిని కేటాయించి సేవా కార్యక్రమాలు చేస్తున్నా వేటికీ ప్రచారం అన్నదే కోరుకోని కాజల్ సైలెంటుగా తన పని తాను చేసుకుపోతోంది. దానధర్మాలు మంచితనం కాజల్ రేంజును అమాంతం పెంచాయి.

తనను ఇంతటి దానిని చేసిన తెలుగు ఆడియెన్ అంటే వల్లమాలిన ప్రేమ కాజల్ కి. ఆ విషయం తన పెళ్లిలో జీలకర్ర బెల్లం ఎపిసోడ్ తోనే అందరకీ అర్థమైంది. తాను వలచిన గౌతమ్ కిచ్లుని పెళ్లాడేసింది. ఇక సంసార బంధనంలో చిక్కుకుని సరికొత్త బాధ్యతలు నిర్వర్తించబోతోంది. చందమామ లైఫ్ లో ఎన్నడూ లేనంత హ్యాపీగా ఉందని తాజాగా రిలీజైన ఇన్ స్టా ఫోటోలు చెబుతున్నాయి. వీటిలో రకరకాల డిజైనర్ దుస్తుల్లో కాజల్ నిండు చందమామనే తలపిస్తోంది. ఓ ఫోటోలో మాత్రం మబ్బు మాటున దాగి చిరునవ్వులు చిందిస్తున్న నెలవంకనే గుర్తు చేస్తోంది కాజల్. ఆ ఆహ్లాదకరమైన నవ్వుతోనే గుండెల్లో వేయి వీణల్ని మోగిస్తోందని చెప్పాలి. ప్రస్తుతానికి గౌతమ్ కిచ్లుకి మాత్రమే.

కాజల్ ఇప్పుడు తన అభిమానులను సత్సంగ్ గౌరీ పూజ వంటి ప్రీ-వెడ్డింగ్ ఉత్సవాలతో అప్ డేట్ చేస్తోంది. ముంబైలోని తాజ్ మహల్ ప్యాలెస్ హోటల్లో ప్రతి విశేషాన్ని సోషల్ మీడియాల్లో రివీల్ చేస్తోంది.

రాధా స్వామి సత్సంగ్ కోసం వరుణ్ బహ్ల్ సొగసైన ఎరుపు తెలుపు కుర్తా-చుడిదార్ ను కాజల్ డిజైన్ చేయించుకున్నారట. గౌరీ పూజ అలాగే పెళ్లికి ముందు చున్నీ వేడుక కోసం కాజల్ లేత-ఆకుపచ్చ అనితా డోంగ్రే లెహెంగా ధరించింది. ఆమె మెహెండి వేడుక తర్వాత గోరింటాకు తో అలంకరించిన చేతులకు సంబంధించిన ఫోటోల్ని షేర్ చేసింది. వాటిలో నిశ్చితార్థపు ఉంగరాన్ని ఆవిష్కరించింది.

“నా కుటుంబం ఓ విలక్షణమైన పంజాబీ.. నా భర్త సగం పంజాబీ.. సగం కాశ్మీరీ. అందుకే ఈ వేడుకల్ని చాలా ప్రత్యేకంగా చేయాలనుకున్నాం. మా ఆచారాలు సంస్కృతి ని ఇరు వైపులా చేర్చడానికి ప్రయత్నించాం” అని కాజల్ తమ వివాహ ఆచారాల గురించి వెల్లడించింది.