‘కాబోయే వధువు’ కాజల్ బ్యాచిలరెట్ పార్టీ…!

0

దక్షిణాది అగ్ర కథానాయికగా వెలుగొందుతున్న కాజల్ అగర్వాల్ పెళ్లి చేసుకోబోతున్నట్లు అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ముంబైకి చెందిన వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లును అక్టోబర్ 30న వివాహం చేసుకోనుంది. ఇటీవలే సన్నిహితుల సమక్షంలో నిశ్చితార్థం చేసుకున్న కాజల్.. పెళ్లి వేడుకలకు కుటుంబ సభ్యులు సహా అతి తక్కువ మంది అతిధుల సమక్షంలో జరుపుకోనుంది. కాజల్ ఈ విషయాన్ని ఇంస్టాగ్రామ్ లో వెల్లడిస్తూ.. ‘అక్టోబర్ 30న ముంబైలో గౌతమ్ కిచ్లుని పెళ్లి చేసుకుంటున్నానని తెలియచేయడానికి చాలా సంతోషిస్తున్నాను. పాండమిక్ సమయంలో మేం మా జీవితాన్ని ప్రారంభిస్తున్నాం. దీనికి మీ అందరి ఆశీస్సులుంటాయని భావిస్తున్నాను. ఇన్నేళ్లుగా మీరు నాపై చూపిన ప్రేమకు ధన్యవాదాలు. నేను ఏదైతే బాగా ఇష్టపడ్డానో దాన్ని తిరిగి కంటిన్యూ చేస్తాను. ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తాను. మీ సహకారాన్ని అందిస్తారని భావిస్తున్నాను” అని పేర్కొంది.

ప్రస్తుతం కాజల్ అగర్వాల్ – గౌతమ్ కిచ్లు ల ఫోటోలు నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి. కాజల్ సోదరి నిషా అగర్వాల్ కూడా కొన్ని ఫొటోలో సోషల్ మీడియా మాధ్యమాలలో షేర్ చేసింది. ఈ ఫోటోలు కాజల్ బ్యాచిలొరెట్ పార్టీకి సంభందించినవని అర్థం అవుతోంది. కాజల్ ‘కాబోయే వధువు’ అనే బ్యాండ్ తగిలించుకొని కనిపిస్తోంది. కాజల్ కి విషెష్ చెప్తూ ఆమె అభిమానులు పెద్ద ఎత్తున పోస్టులు పెడుతున్నారు. ఇక తెలుగులో పలు సినిమాల్లో హీరోయిన్ గా నటించిన కాజల్ సోదరి నిషా అగర్వాల్ 2013లో వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. చెల్లెలికి పెళ్ళైన ఏడేళ్లకు 35 ఏళ్ళ చందమామ పెళ్లి పీటలు ఎక్కనుంది.