అప్పుడే పెళ్లి కబురు అంత చిక్కు తెచ్చి పెట్టిందా?

0

రంగుల ప్రపంచంలో కథానాయికలకు వింతైన సమస్యలు ఎదురవుతుంటాయి. వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడితే చిక్కులే ఇక్కడ. పెళ్లి గురించి ఓపెనైతే ఇక అంతే సంగతి. అప్పటివరకూ ఉన్న ఆఫర్లు కూడా ఉంటాయో ఊడతాయో తెలీని పరిస్థితి ఉంటుంది. అందుకే చాలా మంది నాయికలు గుట్టు చప్పుడు కాకుండా పెళ్లాడేసి ఆనక ఏమీ తెలీనట్టు పర్సనల్ లైఫ్ ని కెరీర్ ని ప్యారలల్ గా డిజైన్ చేసుకుంటారు.

ఇదే తరహాలో పెళ్లి కబురు కాజల్ ని ఇరకాటంలో పడేస్తోందా? ప్రస్తుతం సెట్స్ పై ఉన్న సినిమాల నుంచి తనని తప్పించాలనే ఆలోచన చేస్తున్నారా? అంటే .. దానికి ఆన్సర్ దొరికింది. కాజల్ ఇప్పటికిప్పుడు కమల్ హాసన్ సరసన భారతీయుడు 2లో నటిస్తోంది. అలాగే చిరంజీవి.. చరణ్ లతో కలిసి ఆచార్య లోనూ కీలక పాత్ర పోషించనుంది.

దీంతో ఈ రెండు సినిమాల నుంచి కాజల్ ని తొలగించే అవకాశం ఉందంటూ ప్రచారం సాగిపోతోంది. కానీ అలాంటిదేమీ జరిగేందుకు ఆస్కారం లేదన్నది ఓ విశ్లేషణ. ఇప్పటికే ఈ రెండిటిలో భారతీయుడు 2 చిత్రీకరణలో కాజల్ పాల్గొంది. మిడిల్ లో తొలగించడం కుదరదు. ఆచార్య కు సంబంధించి మాత్రం కాజల్ పై ఎలాంటి చిత్రీకరణ సాగలేదు. ఇక బిజినెస్ మేన్ కం ప్రియుడు గౌతమ్ కిచ్చూని పెళ్లాడేస్తానని కాజల్ ప్రకటించింది మొదలు `ఆచార్య`లో చోటు ఉంటుందా? అన్న చర్చా వేడెక్కిస్తోంది. కానీ చిరు టీమ్ కాజల్ ని వదులుకునేందుకు ఏమాత్రం సిద్ధంగా లేదట. పెళ్లి పెళ్లే.. తర్వాత షూటింగే అని చెబుతున్నారు. తనని తప్పించేదేమీ లేదని తెలుస్తోంది.

నిజానికి ఆచార్య చిత్రంలో త్రిష నటించాల్సింది. క్రియేటివ్ డిఫరెన్సెస్ వల్ల వదిలేసానని త్రిష వెల్లడించింది. ఆ తర్వాత ఆ ప్లేస్ లోకి కాజల్ వచ్చి చేరింది. మహమ్మారీ వల్ల ఆచార్య చిత్రీకరణ ఆలస్యమవ్వడం తో కాజల్ పెళ్లి పైనా దాని ప్రభావం పడే ఉంటుందనేది ఓ గుసగుస. ఆచార్య రెగ్యులర్ షూట్ వచ్చే నెలలో తిరిగి ప్రారంభమవుతుంది. కాజల్ అగర్వాల్ అక్టోబర్ 30 న వివాహం చేసుకోనుంది. అయితే పెళ్లి అనంతరం కాజల్ కి షెడ్యూల్ ని ప్లాన్ చేస్తారట. ఇక వ్యక్తిగత జీవితంలో ఇంపార్టెంట్ డేట్ లాక్ చేశారు కాబట్టి సంపాదనతో పనేం ఉంటుంది? అందుకే ఆచార్య నుంచి తప్పుకున్నా తప్పించినా ఒకటేనని అంతా భావిస్తున్నారు.