హైదరాబాద్ లో కాజల్ రిసెప్షన్

0

టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ వివాహం నేడు జరుగుతోంది. గత మూడు నాలుగు రోజులుగా కాజల్ పెళ్లికి సంబంధించిన వేడుకలు సంగీత్.. మెహందీ వేడుక ఇంకా ఇతర కార్యక్రమాలకు సంబంధించిన ఫొటోలు మరియు వీడియోలు వైరల్ అవుతున్నాయి. కాజల్ పెళ్లి కూతురుగా డాన్స్ చేయడం మరియు అందంగా తయారవ్వడం వంటి వీడియోలు మరియు ఫొటోలు నెట్టింట వైరల్ అయ్యాయి. కరోనా కారణంగా పెళ్లి కొద్ది మంది బంధు మిత్రుల సమక్షంలో జరుగబోతుంది. పెళ్లి వేడుకకు టాలీవుడ్ నుండి ఎవరికి కూడా ఆహ్వానం అందలేదు. అయితే కాజల్ కు టాలీవుడ్ పై ఉన్న అభిమానంతో పెళ్లి తర్వాత రిసెప్షన్ ను ఏర్పాటు చేయబోతున్నట్లుగా సమాచారం అందుతోంది.

పెళ్లి అయిన వారం పది రోజుల లోపే హైదరాబాద్ మరియు చెన్నైల్లో సినిమా ఇండస్ట్రీకి చెందిన వారికి పార్టీ ఇచ్చేందుకు గాను కాజల్ అగర్వాల్ టీం ప్రయత్నాలు చేస్తుందట. ఈ విషయమై మీడియాకు కాజల్ పీఆర్ టీం నుండి లీక్ అందింది. పార్టీకి అతి తక్కువ మందిని మాత్రమే ఆహ్వానించనున్నారు. అనధికారికంగా ఈ పార్టీ ఉంటుందని కూడా ప్రచారం జరుగుతోంది. మొత్తానికి కాజల్ అగర్వాల్ తనకు సౌత్ సినిమా ఇండస్ట్రీపై ఉన్న ప్రత్యేక అభిమానంను పెళ్లి తర్వాత చూపించుకోబోతుంది. పెళ్లి తర్వాత కూడా ఇండస్ట్రీతో రిలేషన్ కొనసాగాలి కనుక కాజల్ పార్టీ ఇవ్వబోతుందనే కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి.