స్టార్ హీరో డైరెక్షన్ లో అక్కినేని హీరో

0

అక్కినేని హీరో నాగచైతన్య ప్రస్తుతం లవ్ స్టోరీతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దం అవుతున్నాడు. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందిన లవ్ స్టోరీ సినిమా థియేటర్లు పూర్తి స్థాయిలో ఓపెన్ అయిన వెంటనే విడుదల చేయాలని భావిస్తున్నారు. ఇక విక్రమ్ కుమార్ దర్శకత్వంలో థ్యాంక్యూ అనే సినిమాను నాగచైతన్య చేసేందుకు రెడీ అవుతున్నాడు. మరికొన్ని రోజుల్లో థ్యాంక్యూ సినిమా షూటింగ్ ప్రారంభం కాబోతున్నట్లుగా సమాచారం అందుతోంది. దిల్ రాజు బ్యానర్ లో థ్యాంక్యూ సినిమా రాబోతుంది. ఈ సమయంలోనే చైతూ మరో సినిమాకు ఓకే చెప్పాడు అంటూ వార్తలు వస్తున్నాయి.

తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడు అయిన కన్నడ స్టార్ హీరో అర్జున్ దర్శకత్వంలో నాగచైతన్య మూవీ ఉండబోతుందట. ఇది అరుదైన కలయిక అనడంలో ఎలాంటి సందేహం లేదు. విభిన్నమైన యాక్షన్ సినిమాను చైతూతో తెరకెక్కించేందుకు అర్జున్ సిద్దం అవుతున్నాడట. ఆ విషయంపై ఇప్పటికే చర్చలు జరుగుతున్నాయనే సమాచారం అందుతోంది.

అర్జున్ తెలుగులో పలు సినిమాల్లో నటించాడు. ఈ మద్య కూడా ఆయన తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈసారి దర్శకుడిగా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు అంటున్నారు. ఈ వార్తలు కనుక నిజం అయితే చైతూ నుండి ఒక భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ వచ్చే అవకాశం ఉందని అక్కినేని అభిమానులు ఆశపడుతున్నారు.