కాజల్ Vs నిషా: అక్క పెళ్లవుతోందని చెల్లి కన్నీళ్లు పెట్టుకుంది

0

కాజల్ అగర్వాల్ ‍‍‍.. గౌతమ్ కిచ్లు కొన్ని గంటల్లోనే భార్యాభర్తలు అవుతారు. ఈ జంట నిన్న మెహెంది హల్ది వేడుకలకు ఆతిథ్యం ఇచ్చింది. ఈ వివాహానికి పూర్వ ఉత్సవాలు కొన్ని అందమైన భావోద్వేగ క్షణాలను ఫోటోల రూపంలో అభిమానులకు షేర్ చేసిన సంగతి తెలిసిందే. కాజల్ అగర్వాల్ ఆమె సోదరి నిషా ఒకరికొకరు ఎంత క్లోజో చెప్పాల్సిన పనే లేదు. బెస్ట్ ఫ్రెండ్స్ లాగా ఉంటారు. వారి సోషల్ మీడియా ఫోటోలు ఆనంద డోలికల్లో తేలియాడుతున్న వైనానికి రుజువుగా నిలుస్తున్నాయి. నిన్న జరిగిన పార్టీలో నిషా అగర్వాల్ ఉద్వేగానికి లోనయ్యారు. అంతేకాదు.. నిషా కన్నీళ్లు పెట్టుకున్నారు. కాజల్ వివాహం కావడంతో మాజీ నటి ఆనందంతో కన్నీళ్లు పెట్టుకుందిట.

కాజల్ అగర్వాల్ ఇన్ స్టాగ్రామ్ లో తన సోదరి నిషా అగర్వాల్ ఎమోషనల్ అవుతున్న క్షణానికి సంబంధించిన అరుదైన ఫోటోను పంచుకున్నారు. ఫోటోలో ఆమె కళ్ళలో ఆనంద భాష్పాలు రావడాన్ని చూడవచ్చు. ఇంతలో కాజల్ హల్ది వేడుక లో ఎంతో సంతోషకరమైన చిత్రాన్ని కూడా సిస్టర్స్ స్వయంగా పంచుకున్నారు. నిషా ఈ ఫోటోలో మునుపెన్నడూ లేని విధంగా సంతోషంగా ఉంది. కాజల్ – కిచ్లు జంట పెళ్లికి కేవలం కుటుంబ సభ్యులు కొద్దిమంది సన్నిహితులతో హాజరవుతారు. టాలీవుడ్ పరిశ్రమకు చెందిన తన సన్నిహితుల కోసం ఈ నటి హైదరాబాద్ లో వివాహ రిసెప్షన్ ఏర్పాటు చేయాలని భావిస్తోందట.

నిషా అగర్వాల్ తాజా ఇంటర్వ్యూలో ..“నా తండ్రి ఇంతకాలం కాజల్ పెళ్లి రోజు కోసం ఎదురుచూస్తున్నారు కాబట్టి ఇది మా అందరికీ ఒక ప్రత్యేక సమయం. కాజల్ వివాహం చేసుకుని వెళ్లిపోతున్నందున మేము కూడా కాస్త ఎమోషనల్ గా ఉన్నాం. కాబట్టి ప్రస్తుతానికి మేం తనతో ఎక్కువ సమయం గడపడానికి ప్రయత్నిస్తున్నాము. కాని ప్రతి ఒక్కరూ ఈ సమయంలో వధువు తరపు బంధువులు ఆక్యుపై చేస్తారు. కాబట్టి నేను ఆమెతో ఎక్కువ సమయం గడపలేదు“ అంటూ ఎమోషన్ అయ్యింది.