సావిత్రి దర్శకుడితో కళ్యాణ్ రామ్ కన్ఫర్మ్

0

‘ప్రేమ ఇష్క్ కాదల్’.. ‘సావిత్రి’ సినిమాలతో దర్శకుడిగా ప్రేక్షకులమ ముందుకు వచ్చిన పవన్ సాదినేని గత నాలుగు సంవత్సరాలుగా మూడవ సినిమా ప్రయత్నాల్లో ఉన్నాడు. పలువురు హీరోలు కథలు విన్నా కూడా ఏవో కొన్ని కారణాల వల్ల ఆలస్యం చేస్తూ వస్తున్నారు. కళ్యాణ్ రామ్ తో పవన్ సాదినేని మూవీ గురించి ఏడాది కాలంగా ప్రచారం జరుగుతోంది. ఇద్దరి మద్య అనేక దఫాలుగా చర్చలు జరిగాయి. అయినా ఇప్పటి వరకు సినిమాను అధికారికంగా కన్ఫర్మ్ చేయలేదు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఎట్టకేలకు పవన్ సాదినేకి వచ్చే ఏడాది ఆరంభంలో డేట్లు ఇచ్చేందుకు ఒప్పుకున్నాడట.

హీరోగా నటించడంతో పాటు నిర్మాతగా కూడా తానే వ్యవహరించేందుకు కళ్యాణ్ రామ్ సిద్దం అయ్యాడని తెలుస్తోంది. ఈ ఏడాది చివరి వరకు ఈ సినిమా గురించి అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉంది. విభిన్నమైన కాన్సెప్ట్ లతో సినిమాలు తీసే పవన్ సాదినేని ఈసారి కూడా కళ్యాణ్ రామ్ ను కొత్తగా చూపించేందుకు ప్రయత్నిస్తున్నాడట. కథ విషయంలో పూర్తి క్లారిటీగా ఉండటంతో పవన్ సాదినేనికి కళ్యాణ్ రామ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడంటున్నారు.

మరో వైపు కళ్యాణ్ రామ్ తన తమ్ముడు ఎన్టీఆర్ చేయబోతున్న తదుపరి సినిమాను రాధాకృష్ణ తో కలిసి త్రివిక్రమ్ దర్శకత్వంలో నిర్మించబోతున్న విషయం తెల్సిందే. ఈ ఏడాది ఆరంభంలో ఎంత మంచివాడవురా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన కళ్యాణ్ రామ్ తన తదుపరి సినిమాను వచ్చే ఏడాది చివరి వరకు విడుదల చేయాలని భావిస్తున్నాడట.