మెగా మూవీ షూట్ లో జాయిన్ అయిన రకుల్

0

ఈ నెల చివరి వరకు రకుల్ ప్రీత్ సింగ్ హిందీ మూవీ షూటింగ్ లో పాల్గొనాల్సి ఉంది. కాని ఆ సినిమా హీరో అర్జున్ కపూర్ కు కరోనా పాజిటివ్ అంటూ నిర్థారణ అయిన నేపథ్యంలో తెలుగు సినిమా షూటింగ్ లో జాయిన్ అయ్యేందుకు హైదరాబాద్ చేరుకుంది. గత కొన్ని రోజులుగా క్రిష్ దర్శకత్వంలో వైష్ణవ్ తేజ్ రెండవ సినిమా షూటింగ్ వికారాబాద్ ఫారెస్ట్ లో జరుగుతోంది. ఈ నెల చివరి నుండి రకుల్ జాయిన్ అవ్వాల్సి ఉన్నా కూడా ముందు నుండే షూటింగ్ కు హాజరు అయ్యేందుకు రకుల్ హైదరాబాద్ వచ్చినట్లుగా తెలుస్తోంది.

నిన్నటి నుండి వైష్ణవ్ తేజ్ మూవీకి సంబంధించిన చిత్రీకరణలో పాల్గొంటుంది. క్రిష్ ఈ సినిమాను ఈ ఏడాది చివరి వరకు పూర్తి చేయాలనే పట్టుదలతో ఉన్నాడు. అందుకే కాస్త పరిస్థితి సీరియస్ గా ఉన్నా కూడా జాగ్రత్తలు తీసుకుంటూ షూటింగ్ చేస్తున్నారు. రకుల్ ఈ సినిమాలో విభిన్నమైన పాత్రలో కనిపించబోతున్నట్లుగా సమాచారం అందుతోంది. ఆమెకు సంబంధించిన ఎక్కువ రోజులు షూటింగ్ చేయాల్సి ఉందట. ఇటీవల డ్రగ్స్ కేసులో రియాను విచారించగా రకుల్ పేరును ఆమె చెప్పిందని జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. కనుక ఈ సినిమా షూటింగ్ కు ఏమైనా అంతరాయం కలుగుతుందా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.