Templates by BIGtheme NET
Home >> Cinema News >> డిప్రెషన్ దుకాణం నడుపుతున్న హీరోయిన్ ఎవరు క్వీన్?

డిప్రెషన్ దుకాణం నడుపుతున్న హీరోయిన్ ఎవరు క్వీన్?


అక్టోబర్ 10 ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం సందర్భంగా కంగన చేసిన ఓ వ్యాఖ్య పెనుకంపనాలు పుట్టించింది. కంగన ఎంతో లాజికల్ గా తన ప్రత్యర్థి దీపిక పదుకొనే పై పంచ్ వేయడం బాలీవుడ్ వర్గాల్లో చర్చకు వచ్చింది. ఈరోజు మానసిక ఆరోగ్య దినోత్సవం సందర్భంగా తన ప్రయోగాత్మక చిత్రం `జడ్జిమెంటల్ హై క్యా`పై అవగాహన కల్పించాలనుకుంటున్నాను ! అంటూ మొదలు పెట్టి చివరికి దీపికను ఈ టాపిక్ లోకి లాంగింది.

ఈ చిత్రాన్ని చూడమని ప్రజలను కోరుతూ ఆమె చేసిన ట్వీట్ లో దీపికా పదుకొనే తో పాత వివాదాన్ని తవ్వి తీసింది అంటూ కంగన పై నెటిజనులు కామెంట్లు చేస్తున్నారు. ఈ చిత్రాన్ని “డిప్రెషన్ కి దుకాణ్ నడుపుతున్న వారు కోర్టుకు లాగారు“ అని అన్నారు అంటూ పాత విషయాన్ని కొత్తగా కెలికింది క్వీన్.

`జడ్జిమెంటల్ హై క్యా`కు మొదట్లో `మెంటల్ హై క్యా` అని టైటిల్ ప్రకటించారు. కానీ ఇది వివాదాస్పదం అంటూ టైటిల్ మార్చాల్సిందేనని మేకర్స్ పై బలవంతం చేశారు. కంగనా ట్వీట్ చేస్తూ “మానసిక ఆరోగ్య అవగాహన కోసం మేము చేసిన చిత్రాన్ని డిప్రెషన్ కి దుకాణ్ నడుపుతున్న వారు కోర్టుకు లాగారు. మీడియా నిషేధం తరువాత.. ఈ చిత్రం పేరు విడుదలకు ముందే మార్చాం. ఇది మార్కెటింగ్ సమస్యలను క్రియేట్ చేసింది. అయితే ఇది మంచి చిత్రం. కనీసం ఈ రోజు అయినా చూడండి #WorldMentalHealthDay“ అంటూ కంగన సోషల్ మీడియాలో వ్యాఖ్యానించింది.

జడ్జిమెంటల్ హై క్యా ఒక వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్ బాబీ (కంగనా) కథ. ఆమె జీవితం వాస్తవికత భ్రమల మధ్య తిరుగుతుంటుంది. రాజ్ కుమార్ రావు తన ఇంట్లో అద్దెకు దిగే కేశవ్ పాత్ర పోషించాడు. అతని భార్య మరణించిన తరువాత బాబీ మనస్సులో అనుమానాలు సందేహాలు మెంటల్ ఎలా సాగింది? అన్నదే సినిమా. మూవీ రిలీజ్ సమయంలో జడ్జిమెంటల్ హై క్యా వివాదం గురించి దీపికాను అడిగినప్పుడు “మాకు మెంటల్ హై క్యా వంటి సినిమాలు ఉన్నప్పుడు.. ఇంత ప్రత్యేకమైన పద్ధతిలో పోస్టర్లు ఉన్నప్పుడు.. మేము మరింత సున్నితంగా వ్యవహరించాలి. మేం దానికి కృషి చేస్తున్నాము. మానసిక అనారోగ్యాన్ని తగ్గించడానికి.. మరోవైపు మూసలో చేయడాన్ని ఆపుతున్నాం“ అంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించింది దీపిక. అందుకే పాత విషయాన్ని ఇలా కంగన కెలికిందన్నమాట.