హీరోగారి మొదటి భార్యను రెండో ఆవిడ అస్సలు కలవలేదట

0

కరీనా కపూర్ అలియాస్ బెబో స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ ని పెళ్లాడిన సంగతి తెలిసినదే. అయితే సైఫ్ వయసులో సగం వయసు ఉండే బెబో అతడిని పెళ్లాడడం అందరినీ షాక్ కి గురి చేసింది. అప్పటికే పెళ్లయి ఇద్దరు ఎదిగేసిన పిల్లలతో ఉండీ.. మొదటి భార్య అమృత నుంచి విడాకులు తీసుకున్న సైఫ్ నే ఎందుకని చేసుకుంది? అంటూ ఒకటే ముచ్చటించుకున్నారు.

అన్నట్టు సైఫ్ ఖాన్ మొదటి భార్య అమృత సింగ్ తో కరీనా అనుబంధం ఎలా ఉంటుంది? ఆ ఇద్దరూ ఎప్పుడైనా కలుసుకున్నారా? అంటే అందుకు నేరుగా బెబోనే ఓ టీవీ కార్యక్రమంలో సమాధానం ఇచ్చింది. ఇంతకీ బెబో ఏమని చెప్పింది? అంటే.. షాక్ తింటారు వింటే.

తాను సైఫ్ అలీ ఖాన్ మాజీ భార్య అమృత సింగ్ను ఎప్పుడూ కలవలేదని చాలా సింపుల్ గా చెప్పేసింది. కరీనా కపూర్ – సైఫ్ అలీ ఖాన్ జంటకు 2012 లో పెళ్లయ్యింది. దీనికి ముందు 1991లో అమృత సింగ్ ని పెళ్లాడిన సైఫ్ 2004 లో విడాకులు తీసుకున్నాడు. అంటే పెళ్లయ్యాక ఈ ఎనిమిదేళ్లలో ఒక్కసారి కూడా మొదటి భార్యను రెండో భార్యామణి కలవలేదన్నమాట. ఈ సీజన్ లోనే బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో అత్యంత ప్రియమైన జంటలలో కరీనా కపూర్ ఖాన్ – సైఫ్ అలీ ఖాన్ జంట ఓ వెలుగు వెలిగారు. వారిద్దరూ 2012 లో పెళ్లికి ముందు కొంతకాలం ఒకరితో ఒకరు డేటింగ్ లో ఉన్నారు. ప్రస్తుతం ఈ జంటకు తైమూర్ అలీ ఖాన్ జన్మించాడు. అలాగే రెండో బిడ్డకు బెబో జన్మనివ్వనుంది.

తాజాగా కాఫీ విత్ కరణ్ 6 సీజన్ లో కరీనాకు ఇదే ప్రశ్న ఎదురైంది. అమృతను ఎప్పుడైనా కలిసారా? అంటూ… అయితే దీనికి బెబో తాను ఎప్పుడూ కలవలేదని పేర్కొంది. అయితే అమృతా పట్ల తనకు ఎంతో గౌరవం ఉందని కరీనా తెలిపింది. విడాకులు తీసుకున్న చాలా సంవత్సరాల తరువాత తాను సైఫ్ అలీ ఖాన్ ను కలవడం వల్లనే తనని కలవలేదేమోనని కూడా సరైన కారణం చెప్పింది.

ఇకపోతే అమృత సింగ్ పిల్లలు సారా అలీ ఖాన్ – ఇబ్రహీం అలీ ఖాన్ లతో కరీనా గొప్ప బంధాన్ని కొనసాగిస్తున్నారు. సోషల్ మీడియాలో అందుకు సంబంధించిన ఫోటోలు ఇంతకుముందు రివీలయ్యాయి. సైఫ్ అలీ ఖాన్ స్వయంగా అమృతా సింగ్ తో తన అనుబంధంపై కాఫీ విత్ కరణ్ లో మాట్లాడారు. కరీనాను వివాహం చేసుకునే ముందు తన మాజీ భార్యకు నోట్ రాసినట్లు సైఫ్ వెల్లడించాడు. అతను దానిని ఆమెకు పంపే ముందు బెబో నుండి ఆమోదం పొందాడట.