ఆ పాన్ ఇండియా మూవీ గుట్టు మాత్రం వీడట్లేదే!

0

బాహుబలి ఏ కేటగిరి చిత్రమో విడుదలకు ముందే అభిమానులకు అర్థం అయింది. సాహో విషయంలో కూడా అంతే. రెగ్యులర్ షూటింగ్ కు ముందే ఈ సినిమాకు సంబంధించిన టీజర్ రిలీజ్ చేసి దాని రేంజ్ ఏంటో చూపించారు. కానీ సాహోతో పాటే మొదలైన రాధే శ్యామ్ మూవీ కథ ఎంటో ఇప్పటికీ అర్థం కావడం లేదు. ఈ విషయంలో చిన్న క్లూ కూడా ఇవ్వడం లేదు. సినిమా 80స్ నేపథ్యంలో సాగుతుందని ఫస్ట్ లుక్ పోస్టర్ల ద్వారా చెప్పారే తప్ప మిగతా వివరాలు మాత్రం వెల్లడించలేదు. ఆ సినిమా 80స్ నేపథ్యంలో సాగే ప్రేమకథ అని కొందరు అంటుండగా పునర్జన్మల నేపథ్యంలో సాగే ప్రేమ కథ అని మరి కొందరు చెబుతున్నారు.

ఈ సినిమాలో హీరో హీరోయిన్ల పేర్లు రాధ శ్యామ్ అయి ఉంటుందని.. అందుకే టైటిల్ రాధే శ్యామ్ గా పెట్టారని అంతా భావించారు. కానీ ఇటీవల పూజ హెగ్డే బర్త్ డే సందర్భంగా ఆ పాత్ర పేరు ప్రేరణగా పరిచయం చేశారు. ప్రభాస్ బర్త్ డే సందర్భంగా విడుదల చేసిన పోస్టర్ లో ప్రభాస్ పేరు విక్రమాదిత్య గా పరిచయం చేశారు. హీరో హీరోయిన్ల పేర్లు వేరుగా ఉంటే మరి రాధే శ్యామ్ అని టైటిల్ ఎందుకు పెట్టారనే సందేహం వస్తోంది. దీన్నిబట్టి ఈ సినిమా ఖచ్చితంగా పునర్జన్మల నేపథ్యంలో సాగే సినిమా అయి ఉంటుందని అభిమానులు అంచనా వేస్తున్నారు. ఫ్లాష్ బ్యాక్ లో విక్రమ్ ఆదిత్య ప్రేరణగా తర్వాతి తరంలో రాధే శ్యామ్ గా పాత్రల పేర్లు ఉండొచ్చని అనుకుంటున్నారు. ఈ సినిమా ఈ ఏడాది విడుదల కావాల్సి ఉండగా.. కరోనా కారణంగా షూటింగ్ ఆగిపోయిన సంగతి తెలిసిందే. వచ్చే ఏడాది వేసవి కానుకగా ఈ సినిమాను విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నారు. అందుకు తగ్గటే సినిమా చిత్రీకరణ జరుపుతున్నారు.