కరోనా తగ్గాక షూటింగ్ కోసం సామాన్లు సర్ధుకున్న మిల్కీ

0

మహమ్మారీ భారిన పడినా రోగనిరోధక శక్తి ఉన్నవారికి ఎలాంటి భయాలు లేవు. ఇంతకుముందు అమితాబ్.. ఐశ్వర్యారాయ్.. అభిషేక్ బచ్చన్.. ఆరాధ్య .. ఇలా ఎందరినో కరోనా వెంటాడింది. అయినా వీరంతా చికిత్సతో కోలుకున్నారు. ఆ తర్వాతా చాలామంది సెలబ్రిటీలు కోలుకుని బయటపడ్డారు. లేటెస్టుగా మిల్కీ వైట్ బ్యూటీ తమన్నా కు కూడా కరోనా సోకిన సంగతి తెలిసిందే.

14 రోజుల నిర్భంధంలో చికిత్స సఫలమై క్రైసిస్ నుంచి బయటపడింది తమ్మూ. ఇలా తగ్గిందో లేదో అలా వెంటనే సామాన్లు సర్ధుకుని హైదరాబాద్ కి షూటింగులకు బయల్దేరిందిలా. ఇక్కడ శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగిన తమన్నాపై కెమెరా కళ్లు ప్రసరించాయి. ఒకటే క్లిక్కులతో హోరెత్తించాయి. ఆ క్రమంలోనే తమన్నా స్మైలిస్తూ కెమెరాలకు ఫోజులిచ్చింది. మాస్క్ ధరించి ఎంతో కేర్ ఫుల్ గా విమానాశ్రయంలో దిగింది ఈ బ్యూటీ.

అక్టోబర్ 5 న తమన్నా ఇన్ స్టా వేదికగా కోవిడ్ -19 కు పాజిటివ్ వచ్చిందని తెలిపింది. ఆ తర్వాత చికిత్స పొంది ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యానని వెల్లడించింది. ఇక పెండింగ్ షూటింగ్ లను తిరిగి ప్రారంభించేసేందుకు ప్రిపేరై ఇలా దిగిపోయింది. గోపిచంద్ తో సీటీమార్… లవ్ మాక్ టైల్ రీమేక్ `గుర్తుందా శీతాకాలం… తమిళ వెబ్ సిరీస్ ది నవంబర్ స్టోరి.. వీటన్నిటికి సంబంధించిన షెడ్యూల్స్ ని తమన్నా బ్యాలెన్స్ చేయాల్సి ఉంది.