కియరా అందం వెనక అసలు రహస్యమిదే!

0

అందం అంటే నీవా? అంటూ ఓ ప్రముఖ లిరిసిస్ట్ అద్భుతమైన లిరిక్ రాశాడు. అయితే అది ఐశ్వర్యారాయ్ ని చూస్తూ రాసిన పాట. కానీ ఇక్కడ కియరా అద్వాణీ అందచందాల్ని చూసినా అంతే మంత్రముగ్ధులైపోతున్నారు యువతరం. ఇంతందాన్ని పొగిడేందుకు కవి కానివాడయినా కాళిదాసు అయిపోవాలంతే.

ఇటీవల చాలా కాలంగా క్వారంటైన్ లో ఉండిపోవడం వల్ల బయటికి వెళ్లి ఏదీ తినేందుకు కుదరలేదు. కానీ కాస్త ధైర్యం చేసి ఇదిగో ఇలా ఆరుబయట టూరిస్ట్ ప్లేస్ కు వచ్చిందట. అక్కడ ఓ స్పెషల్ ప్లేస్ కి వెళ్లి ఇదిగో ఇలా తనకు నచ్చినవన్నీ ఆర్డర్ చేసి ఆరగించేసిందట.

అయితే అక్కడ కనిపిస్తున్న ఫుడ్ చూస్తుంటే ఏదీ కొలెస్టరాల్ ని పెంచేదిగా కనిపించడం లేదు. పండ్లు పలహారాలు స్లైస్ జ్యూస్ లు తప్ప ఇంకేవీ పెద్దగా కనిపించడం లేదు. ఇప్పుడర్థమైందా కియరా అందం వెనక ఉన్న రహస్యం. ఫోర్క్ తో పండ్ల ముక్కల్ని అలా లాలనగా పెదవులకు అందిస్తోంది. నీకో ముక్క నాకో ముక్క అంటూ షేర్ చేసుకునేందుకు కనీసం బోయ్ ఫ్రెండ్ అయినా లేకపాయే! కియరా నటించిన లక్ష్మీ బాంబ్ రిలీజ్ కి వస్తున్న సంగతి తెలిసిందే. పలు భారీ ప్రాజెక్టులు క్యూలైన్ లో ఉన్నాయి.