కాజల్ ఆకర్షణ ఏమాత్రం తగ్గలేదు

0

2007 సంవత్సరంలో నందమూరి కళ్యాణ్ రామ్ తో ‘లక్ష్మీ కళ్యాణం’ సినిమాలో నటించింది కాజల్. ఆ సినిమా నిరాశ పర్చడంతో కాజల్ గురించి ఎవరు పెద్దగా పట్టించుకోలేదు. కాని అదే ఏడాది కృష్ణవంశీ దర్శకత్వంలో చందమామ సినిమాలో ఆఫర్ దక్కించుకుంది. క్రియేటివ్ డైరెక్టర్ పెట్టుకున్న అంచనాలను నూటికి నూరు శాతం కాజల్ నిలబెట్టింది. కాజల్ అక్కడ నుండి వెనుదిరిగి చూసుకోకుండా స్టార్ హీరోయిన్ గా వెలుగు వెలిగింది. 35 ఏళ్ల వయసులోనూ ఇంకా టాలీవుడ్ లో స్టార్ హీరోలకు జోడీగా నటిస్తోంది. ప్రస్తుతం ఈ అమ్మడు చిరంజీవి ఆచార్య చిత్రంలో నటించడంతో పాటు తమిళంలో కూడా పెద్ద సినిమాల్లో నటిస్తుంది. ఇక ఈ అమ్మడు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది.

ఈమద్య కాస్త లావు అయినట్లుగా అనిపించిన ఈ అమ్మడు ఆ తర్వాత తనను తాను మళ్లీ మార్చకుని మోస్ట్ వాంటెడ్ గా ఉండాలంటే నాజూకుగా ఉండాలనే ఉద్దేశ్యంతో మళ్లీ మునుపటి రూపంకు వచ్చింది. తాజాగా ఈ ఫోటోను ఇన్ స్టాగ్రామ్ లో కాజల్ పోస్ట్ చేసింది. ఈ ఫొటో చూసిన ఎవరైనా కూడా చందమామలో ఏమాత్రం ఆకర్షణ తగ్గలేదు. యంగ్ హీరోలు కొత్త హీరోలకు కూడా ఈమె హీరోయిన్ గా నటించేంతగా ఛార్మింగ్ ఉందని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ఈమె దూకుడు మరియు గ్లామర్ చూస్తుంటే మరో నాలుగు అయిదు ఏళ్లు అయినా హీరోయిన్ గా మంచి ఫామ్ తో కొనసాగే అవకాశం ఉంది అంటున్నారు.