Templates by BIGtheme NET
Home >> Cinema News >> వెనుకబడిపోతున్న ఓటీటీ…!

వెనుకబడిపోతున్న ఓటీటీ…!


ప్రస్తుతం డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్స్ అయిన ఓటీటీల హవా కొనసాగుతోందని చెప్పవచ్చు. ఓటీటీలలో వచ్చే ఒరిజినల్ సినిమాలు వెబ్ సిరీస్ లు చూడటానికే అందరూ ఆసక్తి చూపిస్తున్నారు. దీనికి తోడు కరోనా లాక్ డౌన్ కారణంగా దేశవ్యాప్తంగా థియేటర్స్ క్లోజ్ అవడం వల్ల కొత్త సినిమాలు కూడా ఓటీటీలలోనే డైరెక్ట్ రిలీజ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వీక్షకులకు అనేక డిజిటల్ స్ట్రీమింగ్ యాప్స్ అందుబాటులో ఉన్నాయి. నెట్ ఫ్లిక్స్ – అమెజాన్ ప్రైమ్ – డిస్నీ ప్లస్ హాట్ స్టార్ – సన్ నెక్ట్స్ – ఎమెక్స్ ప్లేయర్ – జీ 5 – ఆల్ట్ బాలాజీ – ఊట్..ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. వీటితో పాటు 100 శాతం తెలుగు కంటెంట్ తో ‘ఆహా’ అనే తెలుగు ఓటీటీ కూడా వచ్చింది. ప్రస్తుతం జనాలు ఎంటర్ టైన్ మెంట్ కోసం ఈ ఓటీటీలే ఆశ్రయిస్తున్నారు. అయితే వీటన్నిటిలో సన్ నెక్ట్స్ డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్ వెనుకబడిపోయిందని ఓటీటీ వర్గాల్లో డిస్కస్ చేసుకుంటున్నారు.

కాగా ఓటీటీ దిగ్గజాలు నెట్ ఫ్లిక్స్ మరియు అమెజాన్ ప్రైమ్ దూసుకుపోతున్నాయి. ఎప్పటికప్పుడు ఫ్రెష్ కంటెంట్ ని వీక్షకులకు అందుబాటులో ఉంచుతూ టాప్ లో కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో క్రేజీ మూవీని కూడా రిలీజ్ చేస్తూ సబ్ స్క్రైబర్స్ ని పెంచుకుంటూ పోతున్నాయి. ఇక ఈ మధ్య వచ్చిన తెలుగు యాప్ ‘ఆహా’ కూడా కొత్త సినిమాలను డైరెక్ట్ రిలీజ్ చేస్తూ వ్యూయర్ షిప్ పెంచుకుంటోంది. జీ 5 కూడా ఇటీవల క్రేజీ మూవీస్ ని విడుదల చేస్తోంది. అయితే వీటితో పోల్చుకుంటే రిలీజుల విషయంలో సన్ నెక్ట్స్ వారు మాత్రం చాలా వెనుకపడిపోయారనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.

దీనికి అసలు కారణం సన్ నెక్ట్స్ వారు ఆఫర్ చేస్తున్న కమర్షియల్ డీల్స్ అనే వాదన ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. సన్ నెక్ట్స్ మరియు నెట్ ఫ్లిక్స్ మధ్య అంతర్గత డీల్స్ లో భాగంగా ఏ సినిమా అయినా రెండు ఓటీటీలలో విడుదల చేసే అవకాశం ఉందట. అందుకే ఒక్కరితో డీల్ కుదుర్చుకుంటే సరిపోతుందనే ఆలోచనతో అందరూ నెట్ ఫ్లిక్స్ తోనే డీల్స్ చేసుకుంటూ సన్ నెక్ట్స్ ని పక్కన పెడుతున్నారని సమాచారం. కాకపోతే ఈ ఏడాది థియేటర్స్ లో రిలీజైన సూపర్ హిట్ సినిమాల శాటిలైట్ రైట్స్ వీరి దగ్గరే ఉండటం వీరికి కాస్త కలిసొచ్చే అంశమని ఓటీటీ వర్గాల్లో అంటున్నారు.