భువికి దిగివచ్చిన దేవకన్యలా కియారా..!

0

బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ గ్లామర్ షోలో ట్రెండ్ సెట్ చేస్తూ ఉంటుంది. సినిమాల్లోనే కాకుండా బయట కూడా హాట్ డ్రెస్సులతో కుర్రాళ్ల మతులు పోగొడుతుంది. ఎప్పటికప్పుడు ట్రెండీ అవుట్ ఫిట్స్ తో దర్శనమిచ్చి అందరి కళ్ళు తనవైపు తిప్పేలా చూసుకునే కియారా.. తాజాగా ఎథిక్ దుస్తుల్లో కనిపించి అందర్నీ ఆశ్చర్యపరిచింది. కరోనా కారణంగా గత కొన్ని నెలలుగా ఇంటికే పరిమితమైన కియారా.. ఆమె నటించిన ‘లక్ష్మీబాంబ్’ త్వరలో ఓటీటీలో విడుదల అవుతున్న నేపథ్యంలో విస్తృతంగా ప్రమోషన్స్ లో పాల్గొంటోంది. ఇంతకముందు ఓ షో కోసం బ్లాక్ స్కర్ట్ లో వచ్చి అదరగొట్టిన ఈ ముద్దుగుమ్మ.. ఇప్పుడు ఫెస్టివల్ మూడ్ లోకి మారిపోయింది. కియారా ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసిన ఆ ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

ఈ ఫొటోలో కియారా అద్వానీ.. బెర్రీ బ్లర్డ్ పోల్కా ప్రింట్ హ్యాండ్-ఎంబ్రాయిడరీ ఘరారా మరియు జాకెట్టు ధరించి అదరగొట్టింది. దీనికి సరైన దుపట్టా కూడా ధరించింది. ఎథిక్ దుస్తుల్లో ఉన్న ఆమెకు ఇయర్ రింగ్స్ మరియు నెక్లెస్ ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. లూజ్ హెయిర్ తో స్మైల్ ఇస్తూ అమ్మడు ఇచ్చిన పోజ్ కి అందరూ ఫిదా అవుతున్నారు. ఈ ఫోటోలను చూసిన యువ హృదయాలు దివి నుంచి భువికి దిగివచ్చిన దేవకన్యలా ఉందని కామెంట్స్ పెడుతున్నారు. ‘ఎం.ఎస్.ధోని’ సినిమాతో క్రేజ్ తెచ్చుకున్న కియారా.. మహేష్ బాబు నటించిన ‘భరత్ అనే నేను’ అనే సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెట్టింది. ఆ ఒక్క సినిమాతో తెలుగులో స్టార్ హీరోయిన్ హోదా సంపాదించుకుంది. అయితే ‘వినయ విధేయ రామ’ సినిమా తర్వాత మరో తెలుగు సినిమాలో నటించలేదు. బాలీవుడ్ లో మాత్రం వరుస సినిమాలతో సత్తా చాటుతోంది.