ఆ విమర్శల్ని ఇప్పటికీ గుర్తు పెట్టుకున్నాను

0

నటి కియారా అద్వానీ తనను ట్రోల్ చేసిన సమయాన్ని గుర్తు చేసుకుంటుంది. నెటిజన్లు ఆమె బొటాక్స్ చికిత్స చేయించుకుందని ఇటీవల ట్రోల్ చేసిన విషయం తెలిసిందే. గత ఏడాది ట్రోలర్స్ కి కియారా ప్రధాన టార్గెట్గా నిలిచింది. డీప్ గా హర్ట్ అయిన గత సంగతుల్ని నేహా దూపియా నిర్వహిస్తున్న `నో ఫిల్టర్ విత్ నేహా`లో వెల్లడించింది కియారా.

ఈ వార్తలు విని కియారా మదర్ ప్రారంభంలో చాలా ఫీలైందట. ఇలాంటి వార్తలు నా దాకా రానివ్వకని చెప్పిందట. ఇలాంటి వార్తల్ని నేను చదవనని పట్టించుకోనని అమెకు తెలుసు అయితే ఇలాంటి వాటిని కొంత మంది పతాక శీర్షికల్లోకి ఎక్కించడం బాధించింది. చిన్న చిన్న విషయాలకే భయపడిపోయి చమటపట్టేయడం నా నైజం కాదు. ఇవి ముఖ్యమైనవి కావు. పెద్ద సమస్యలు పరిశీలించవలసిన విషయాలు చాలా ఉన్నాయి. కాని మీరు చదివినవన్నీ ఎల్లప్పుడూ నిజాలు కావు అనే సత్యాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని నేను కోరుకుంటున్నాను` అంటోంది కియారా.

`నేను స్టైలింగ్ చేయడాన్ని గుర్తుంచుకున్నాను.. నేను చాలా తరచుగా ఇలా చేస్తాను. నా జుట్టు.. మేకప్ అలాగే స్టైల్ ని నేనే చేస్తాను. నేను మొత్తం పరివారం అని పిలుస్తాను మరియు ఆ రోజు నేను చాలా మంచి పని చేయలేదు. నా ఐ షాడోను కొంత ఎక్కువగా చేశాను. దాని వల్ల నన్ను ఎవరో కన్నుపై గుద్దినట్టుగా కనిపించాను. దీంతో ఆమెకు బొటాక్స్ వచ్చింది అని ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. ఆ విమర్శల్ని ఇప్పటికీ గుర్తుపెట్టుకున్నాను. దాంతో నా నోటిఫికేషన్స్ అన్నింటినీ క్లోజ్ చేయాలనుకున్నాను. `నా కోసం.. నా దర్శకుడు ఏమనుకుంటున్నారో అది నాకు ముఖ్యం కాని మీరు ఎక్కడ గీత గీసుకోవాలో అది మీరు నిర్ణయించుకోవాలి` అని స్ట్రాంగ్ గా కౌంటరిచ్చింది కియారా.