40వ బర్త్ డే వేడుకలో బంగారు బాతు బికినీ ట్రీట్

0

ఏజ్ బార్ అవుతున్నా కొందరు భామల్లో నవనవలు పెరుగుతాయే కానీ తరగవు. ఆ కోవకే చెందుతుంది ప్రముఖ రియాలిటీ స్టార్ కిమ్ కర్థాషియన్ వెస్ట్. లేటెస్టుగా 40వ పుట్టినరోజును ఈ అమ్మడు ఓ రేంజులోనే సెలబ్రేట్ చేసింది. ఈ సందర్భంగా కిమ్ షేర్ చేసిన ఫోటోలు నెటిజనుల కంటికి కునుకు పట్టనివ్వని ట్రీటిస్తున్నాయి.

కిమ్ కర్దాషియాన్ రూపలావణ్యం.. ఏళ్లు గడిచే కొద్దీ మృధువైన వైన్ లాగా సొగసు చూడతరమా? అన్న తీరుగానే తయారవుతోంది. సదరు రియాలిటీ టీవీ స్టార్ హాలీవుడ్ సర్కిల్ లో అంతగా పాపులర్ అవ్వడం వెనక కారణమేంటో ఇదిగో ఈ లుక్ చూస్తే మీకే అర్థమైపోతుంది. కిమ్ కర్దాషియాన్ వెస్ట్ బర్త్ డే స్పెషల్.. ఇదిగో ఇలా జిలెటిన్ స్టిక్ పేలుడులో గుచ్చుకున్న అద్దం ముల్లులా అమ్మడు తెగ గోల పెట్టించేస్తోంది! అంటూ ఒకటే ఫ్యాన్స్ తెగ ఇదైపోతున్నారు. 90 డిగ్రీల నుంచి 360 డిగ్రీల కోణంలో బిడే సెలబ్రేషన్ అదిరిపోయింది అంటూ కామెంట్ చేస్తున్నారు.

లేటెస్టుగా బంగారు బికినీతో బోయ్స్ కి అదిరే ట్రీటిచ్చింది మరి. బీచ్ అందాల నడుమ బంగారు బాతు బికినీ ట్రీట్ అంటూ ఈ ఫోటోలకు బోయ్స్ వ్యాఖ్యల్ని జోడిస్తున్నారు. ముఖ్యంగా కిమ్ కర్దాషియాన్ వొంపు సొంపుల్ని వర్ణించే పనిలోనే 6 నుంచి 60వరకూ ఎంతో ఇదైపోతున్నారు. హాలీవుడ్ ఐకానిక్ స్టైలిస్టులు కెండల్ జెన్నర్ కిమ్ ఈ గౌరవానికి అర్హురాలని భావిస్తున్నారట.